ఇండియాలో వ్యవసాయ రంగం చాలా అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటని కూడా చెప్పవచ్చు..2022-23 ఆర్థిక సంవత్సరాలలో ఇండియాలో GDP వ్యవసాయ రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి తెలియజేశారు.అందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా పలు రకాల ప్రోత్సాహాలను కూడా అందిస్తోంది అంటూ తెలుపుతున్నారు. ఇటీవలే బీహార్లో గీతాదేవి అనే మహిళ సాంప్రదాయమైన వ్యవసాయాన్ని ఆశ్రయించి కాయగూరలు అమ్మకం వల్ల లేదా మార్కెట్లోకి తీసుకొని వెళ్లడం వల్ల ప్రతిరోజు సుమారుగా రూ.5000 రూపాయలు సంపాదిస్తోందట.


ఈమె వద్ద కేవలం 120 సెంట్లు భూమి మాత్రమే ఉన్నది. ఇందులో ఇమే పలు రకాల ఆకుకూరలు కాయగూరలు పండిస్తూ భారీగానే లాభాలను అందుతోంది. పలు రకాల టీవీలలో కార్యక్రమాలను చూసి ఇమే కూరగాయల సాగులో స్ఫూర్తి పొందినట్లుగా తెలియజేసింది. అయితే 120 సెం లను మూడు భాగాలుగా చేసి అందులో కాయగూరలు మాత్రమే సాగు చేస్తున్నారని తెలిపింది. ఉదయం పూట లేవగానే కూరగాయల మార్కెట్ కు ఫోన్ చేసి కూరగాయల ధరలను తెలుసుకొని మార్కెట్ కి ధర ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడికి వెళ్లి అమ్ముతానని తెలిపింది.


ప్రస్తుతం గీతాదేవి అనే మహిళ వంకాయల సాగుతో కూరగాయల సాగుతూ రోజుకి సుమారుగా రూ.500 ఖర్చు అవుతుందని అయితే ఈ కూర కాయలు అమ్మడం వల్ల  రూ.3 వేల నుంచి 5000 రూపాయల వరకు వస్తుందని తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్నవాటిలో టమోటా ,బెండకాయలు మంచి గిరాకీ ఉందని.. తమ జిల్లాలలోని పలు రకాల రైతులు కూడా ఎక్కువగా టమోటా సాగున చేస్తూ ఉంటారని తెలిపింది. అయితే ఎటువంటి కెమికల్ మందులను కొట్టకుండా కేవలం ఎరువుతోనే నాణ్యత కలిగిన పండించడం వల్ల కాయగూరలు కూడా చాలా రుచిగా ఉంటాయని అందువల్లే మార్కెట్లు తమ కాయగూరలకు మంచి డిమాండ్ ఉందంటూ తెలిపింది గీతాదేవి. ఇలా ఎవరైనా సరే వారి అనుగుణంగా కాయగూరలను పెట్టుకొని మంచి లాభాలను పొందుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: