ఈ ఏడాది ఎలక్షన్స్ కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు ఒక గుడ్ న్యూస్ అని తీసుకురాబోతోంది. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్ను సైతం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వచ్చే నెల ఒకటవ తేదీన ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా రైతులను ఆకట్టుకునే విధంగా PM KISON నిధి తో సహ వారి సంక్షేమ పథకానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రైతులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వార్తలు వినిపిస్తున్న తరుణంలో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఈసారి పార్లమెంట్ ఎన్నికలు కాస్త ముందుగా రాబోతున్నాయి. ఈ తరుణంలోనే మధ్యంతర బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏవి కూడా ఆశించినట్లుగా కనిపిస్తోంది.. కానీ పీఎం కిసాన్ సన్మానిధి మాత్రం 50% నిధులను పెంచొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.పీఎం కిసాన్ కింద ప్రతి ఏడాది కూడా రైతులకు రూ .6000 అందిస్తోంది.అయితే ఈ సహాయాన్ని రూ .9000 వేల వరకు పెంచవచ్చని ది ఎకనామిక్స్ టైమ్స్ తెలుపుతున్నారు. గత ఏడాది కూడా పీఎం కిసాన్ స్కీం కింద 60 వేల కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి యేట రూ .3000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


మరి ఎందుకు సంబంధించి పూర్తి విషయం తెలియాలి అంటే ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆగాల్సిందే.. ఇందులో ప్రవేశపెట్టే బడ్జెట్ విషయంలో రైతులకు ఏదైనా శుభవార్త అందిస్తారేమో చూడాలి.. రోజురోజుకి పంటకి అవసరమైన మందు మూటలు ధరలు పెరుగుతూ ఉండడంతో పాటు సగటు కూలి రేటు కూడా పెరుగుతూనే ఉంది. దీంతో  చాలామంది రైతులు ఏదైనా పంటలు పండించాలంటే కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని పెంచే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: