అల్లు అర్జున్ ఒకప్పుడు అందరివాడు అయితే ఇప్పుడు అతడు అనుసరిస్తున్న విధానాల వల్ల చాలామందికి బన్నీ దూరం అవుతున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘చెప్పను బ్రదర్’ వ్యవహారంతో పవన్ అభిమానులకు ‘సైరా’ విడుదలైన వెంటనే స్పందించకుండా ఆలస్యంగా స్పందించి చిరంజీవి అభిమానులకు ఇప్పటికే ఒక చిన్న గ్యాప్ ను తనకు తానుగా క్రియేట్ చేసుకున్నాడు. 

ఇది చాలదు అన్నట్లుగా సంక్రాంతి రేసుకు మహేష్ ను కార్నర్ చేస్తూ తన సినిమాను ఒకేరోజు విడుదల చేస్తున్న పరిస్థుతులలో మహేష్ అభిమానులు కూడ బన్నీ పై తీవ్ర అసహనంలో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా బన్నీ తీరుతో పూజ హెగ్డే సుశాంత్ లకు కూడ బన్నీకి తెలియకుండానే నష్టం జరిగిందా అంటూ కొందరు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక వివరాలలోకి వెళితే ‘అల వైకుంఠపురంలో’ మూవీ యూనిట్ పూజ హెగ్డే పుట్టినరోజునాడు శుభాకాంక్షలు ఈ సినిమాలోని ఆమె లుక్ కు సంబంధించి ఒక స్టిల్ విడుదల చేసారు. ఈ స్టిల్ ఆరోజు వైరల్ అవుతూ ఉండగా అదేరోజు ఈ మూవీలోని అల్లు అర్జున్ కు సంబంధించిన మరొక పోస్టర్ ను విడుదల చేసారు. దీనితో బన్నీ అభిమానుల దృష్టి అంతా ఆ కొత్త పోస్టర్ పైకి వెళ్ళిపోయింది. 

అదేవిధంగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రను పోషిస్తున్న అక్కినేని యంగ్ హీరో సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మూవీలోని అతడి ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ మంచి స్పందన వస్తున్న కొన్ని గంటలలోనే ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు సంబంధించిన మరొక పాటను విడుదల చేయడంతో మళ్ళీ బన్నీ అభిమానుల దృష్టి అంతా ఆ పాట పైకి వెళ్ళిపోయింది. దీనితో అల్లు అర్జున్ తనకు తాను తెలియకుండానే ఇతరుల ఇగో ను హర్ట్ చేసే విధంగా బన్నీ వ్యవహార శైలి మారిందా అంటూ మారిపోతున్న బన్నీ తీరు పై కొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: