మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా 'ఉప్పెన' లో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్నారు. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత బాణీలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలోని రెండు పాటలను యూట్యూబ్ లో విడుదలై భారీ హిట్స్ గా నిలిచాయి.

అయితే ఈ సినిమాలోని పాటల కంటే పాటలలో కనిపించే హీరోయినే ఎక్కువగా హైలెట్ అవుతోంది. కృతి శెట్టి అందం అభినయానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. నీ కళ్ళు నీలి సముద్రం అనే పాట విడుదల కాగానే యువత కళ్ళు మొత్తం కృతి శెట్టి పైనే పడ్డాయి అంటే అతిశయోక్తి కాదు. చాలా క్యూట్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకోవడానికి యూత్ మొత్తం గూగుల్ లో ఆమె కోసం వెతికేశారు.

అయితే ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలే అని తెలిసి అవాక్కయ్యారు. బెంగళూరుకి చెందిన కుర్ర హీరోయిన్ కృతి సినిమాల్లోకి ఎలా రంగ ప్రవేశం చేశారో తెలుసుకుంటే..

భరతనాట్యం నేర్చుకుంటున్న కృతి శెట్టి ని చూసిన  డైరెక్టర్ జై తీర్థ ఆమెలోని అందం, అభినయానికి ఫిదా అయిపోయారట. నటనలో ప్రావీణ్యం పొందితే భవిష్యత్తు చాలా బాగుంటుందని కృతి శెట్టి కి జై తీర్థ ఎన్నోసార్లు చెప్పారట. అలాగే ఆమెను 'సమస్తీ సండే స్కూల్ ఆఫ్ డ్రామా' లో జాయిన్ అయ్యేలా కన్విన్స్ చేశారు.

తదనంతరం కృతి శెట్టి డ్రామా లో డిప్లమా కోర్సు పూర్తి చేసి 'ప్రీతి' అనే ఒక స్టేజ్ షోలో పర్ ఫామ్ చేశారు. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఆ తర్వాత సదరమే అనే మరొక స్టేజ్ షోలో తన అద్భుతమైన నటన చాతుర్యాన్ని ప్రదర్శించి కర్ణాటకలో చాలా పాపులారిటీ తెచ్చుకున్నారు.

కొద్దిరోజుల పాటు డైరెక్టర్ అనిల్ కుమార్ దేశాయ్ తో కలిసి పనిచేసిన కృతి శెట్టి ఆ తర్వాత సరిగమ అనే కన్నడ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఆ సినిమాతో బాగా పేరు తెచ్చుకున్న కృతి సగక్కల్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చిన్న వయసులోనే తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ అజగర్ సమియిన్ కుతిరయ్, కొండాన్ కొడుతాన్, పందియా నాడు, స్నేహవిన్ కాదలర్కాల్, మాంగ, సెవిల్ సినిమాల్లో నటించి తన క్రేజ్ ని మరింత పెంచుకున్నారు. తెలుగులో ఇంకా ఆమె మొదటి సినిమా విడుదల కాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: