బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నో గ్రఫీ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది.తాజాగా ముంబై జుహూ లోని శిల్పా శెట్టి ఇంటి వద్దకి పోలీసులు చేరుకున్నారు.అంతేకాదు వారి వెంట రాజ్ కుంద్రా కూడా ఉన్నట్లు సమాచారం.ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని లోతుగా విచారించేందుకు నటి శిల్పా శెట్టిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించనున్నారు.ఈ నేపథ్యంలోనే శిల్పా శెట్టిని ముంబై పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు శిల్పా శెట్టి.ఇక ఇటీవలేముంబై అందేరి వెస్ట్ లోని వియాన్ కంపెనీ పై దాడి చేసిన పోలీసులు..

అక్కడి నుండి భారీ పోర్న్ వీడియోల డేటానీ సేకరించారు.ఈ నేపథ్యంలో అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీని ముంబై మేజిస్ట్రేట్ జూలై 27 వరకు పొడిగించడం జరిగింది.అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా రాజ్ కుంద్రా నోరు విప్పలేదని తెలుస్తోంది.దీంతో కేసు దర్యాప్తులో భాగంగా శిల్పా శెట్టిని ముంబై పోలీసులు ప్రశ్నించనున్నారు.ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కేసులో రాజ్ కుంద్రా తో కలిపి 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..

ఇదే కేసులో నటి శిల్పా శెట్టి ప్రమేయం ఏమైనా ఉందేమోనన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ కేసులో శిల్పా శెట్టికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ మిళింద్ బరంబే తాజాగా విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఇక ఇదిలా ఉంటె ఏడాదిన్నరలో దాదాపు వంద పోర్న్ వీడియోలు తయారు చేసినట్లుగా రాజ్ కుంద్రా పై కొన్ని ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి.అంతేకాదు కుంద్రా పోర్న్ యాప్ కు 2ప్ లక్షల మంది సబ్స్ క్రైబర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: