ఇప్పటికే వేణు శ్రీరామ్ తో చేసిన వకీల్ సాబ్ అలానే ఇటీవల సాగర్ కె చంద్ర తో చేసిన భీమ్లా నాయక్ సినిమాలతో రెండు విజయాలు సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ తీస్తున్న ఈ భారీ పీరియాడికల్ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా యువ భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రి కీలక రోల్ చేస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తుండగా జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.
అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే దీని తరువాత హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయనున్నారు పవన్ కళ్యాణ్, ఈ మూవీ త్వరలో పట్టాలెక్కనుండగా ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు కొద్దిరోజులుగా కథనాలు ప్రచారం అవుతున్నాయి. దీనికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. అయితే దీని తరువాత నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక మూవీ తెరకెక్కనుంది.

తమిళ హిట్ మూవీ వినోదయ సితం కి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కి జోడీగా సక్సెస్ఫుల్ హీరోయిన్ రష్మిక ఎంపికైందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల ఆమెను కలిసి కథ, కథనాలు వినిపించిన దర్శకుడు సముద్రఖని, ఆమె నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారట. త్వరలో ఈ మూవీ డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ కానున్నట్లు సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే ఫస్ట్ టైం పవర్ స్టార్ మూవీలో రష్మిక ఛాన్స్ కొట్టినట్లే.  

మరింత సమాచారం తెలుసుకోండి: