గత వారం రోజుల నుండి ఎక్కువగా f-3 సినిమా టీమ్ సభ్యులందరూ ఎక్కువగా సినిమా ప్రమోషన్లో లోనే పాల్గొంటున్నారు. విక్టరీ వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ తో సహా హీరోయిన్స్ కూడా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు కానీ తమన్నా కూడా ఎక్కడా కనిపించడం లేదు అందుకు కారణం ఏంటి అనే విషయం ఇంకా తెలియడం లేదు. కానీ తమన్నా కొన్నిరోజులుగా కేన్స్ ఉత్సవాలలో పాల్గొంటూ చాలా బిజీగా ఉండడం చేత ఆమె సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక పూజ హెగ్డే కూడా అందులో పాల్గొని తిరిగి ఇండియాకి వచ్చి.. తాజాగా సినిమా షూటింగ్ లో పాల్గొన్న బోతోంది. కానీ తమన్నాకు మాత్రం అలాంటి అవకాశం లేదు దాదాపుగా కేన్స్ ఉత్సవాలు అని ముగింపు వరకు అక్కడే ఉండవలసి వచ్చిందట. దీంతో ఈ అమ్మడు సినిమాకు సంబంధించి ప్రమోషన్ పనులకు దుమ్మ కొట్టగా తప్పడం లేదు. ఇక అంతే కాకుండా తమన్నా కేంద్ర ఉత్సవాలకు స్పాన్సర్ గా కూడా వ్యవహరిస్తున్నదట. ఇక ఈమె ప్రీమియం స్కాచ్ విస్కీ బ్రాండ్ వాటి ద్వారా ఈమెకు కేన్స్ ఉత్సవాలకు హాజరైంది.


ఇక అక్కడ ఉత్సవాలు అయిపోయే వరకు ఉండేలా ఈమెతో అగ్రిమెంట్ చేసుకుందట బ్రాండ్ సంస్థ. అందుకు భారీ పారితోషకం కూడా తమన్నాకి చెల్లిస్తున్నారు. అందుచేతనే తమన్నా మొదటి ప్రాధాన్యత కేన్స్ ఉత్సవాలకు ఇస్తోంది. ఇక సినిమాలు షూటింగ్ రెగ్యులర్ లైఫ్..కానీ కేన్స్ ఉత్సవాలు కేవలం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే జరుగుతాయి అందుచేతనే ఈ సినిమా ప్రమోషన్స్ పక్కన పెట్టిందేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కేన్స్ ఉత్సవాలు రెండు రోజుల్లో ముగియనునట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో తమన్నా ఇండియా కి బయలుదేరి వస్తున్నట్లుగా సమాచారం. ఇక ఎఫ్ త్రీ సినిమా కూడా మరికొద్ది గంటల్లో విడుదల కానుంది మరి ఈ సినిమాకు సంబంధించి తమన్నా ఏదైనా చేయాలనుకుంటే అంతలోపు చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: