అక్కినేని నాగచైతన్య నటించిన maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంత తన అందంతో, అభినయంతో అందరిని మాయ చేసి అందరిని తన అభిమానులుగా మార్చుకుంది.


తను నటించిన మొదటి సినిమా మంచి హిట్ అవడంతో సమంతకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ బాగా బిజీగా ఉంది.


సమంత కొంత కాలం క్రితం నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ బాధ నుండి బయటపడటానికి సమంత వెకేషన్స్ కి వెళ్తూ వరుస సినిమాలు ఒప్పుకొని చాలా యాక్టింగ్ తో బిజీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం, ఖుషి వంటి సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయితే ప్రతి విషయంలో తను అనుకున్నది సాధించాలని సమంత ఎంతో పట్టుదలగా ఉంటుందట.. ఇక వర్కౌట్స్ విషయంలో కూడా సమంత చాల పట్టుదలగా ఉంటుందట . షూటింగ్ కోసం ఔట్ డోర్ లో ఉన్న కూడా సమంత వరకౌట్స్ చేయటం అస్సలు మానదు.


 


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తరచూ తన జిమ్ వర్కౌట్ లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల సమంత తన జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సమంత బరువు ఎత్తున్న తన ఫోటోని షేర్ చేస్తూ ఈరోజు 90 కేజీలు.. 100 కేజీలు ఇక 10 కేజీల దూరంలో ఉన్నా. 100 కేజీలు త్వరలోనే నీ అంతు చూస్తా అంటూ రాసుకొచ్చిందట 


 


ఇక దీన్ని బట్టి అర్థమవుతోంది సమంత వర్కౌట్ విషయంలో ఎంత పట్టుదలగా ఉంటుందో అని.ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోందట.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో సమంత విజయ్ దేవరకొండ మధ్య లిప్ లాక్ సీన్ ఉండబోతోంది అంటూ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినందుకు సమంత మీద పలు విమర్శలు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు ఏకంగా లిప్ లాక్ సీన్ చేస్తే ఇంకా అంతే మరీ...

మరింత సమాచారం తెలుసుకోండి: