మెగా బ్రదర్ నాగబాబు.. ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో  సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్నాడు. అదే సమయంలో  సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన వ్యాఖ్యలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాడు. మరోవైపు జబర్దస్త్ కామెడీ షో ద్వారా జడ్జిగా ప్రత్యక్షమై బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయ్యాడు అని చెప్పాలి. ఇక అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.


అయితే 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన నాగబాబు చివరికి ఓటమి చవిచూశారు. తర్వాత కొన్నాళ్ల పాటు ఇదే నిరాశలో ఇక పార్టీ కార్యకలాపాలకు నాగబాబు దూరం ఉన్నారు అని చెప్పాలి. కానీ గత ఏడాది కాలం నుంచి మాత్రం ఆయన జనసేన పార్టీ తరఫున సీరియస్ పొలిటీషియన్ గా పని చేస్తూ ఉన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ ఎజెండాను భుజాన వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ నాదెండ్ల భాస్కర్ తర్వాత మూడవ స్థానం ఏకంగా మెగాబ్రదర్ నాగబాబుదే అన్నది తెలుస్తుంది.
 అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే నాగబాబు జనసేన భావజాలాన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు అని చెప్పాలి. అదే సమయంలో తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగులతో పోస్ట్ లూ పెడుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల నాగబాబు ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. ఎవరిని వదులుకోవడానికి సిద్ధపడను.. ఒకవేళ అలా వదులుకున్నాను అంటే వాడంత పెద్ద ఎదవ ఇంకా ఎవడూ ఉండడు అటు ఒక కోట్ రాసుకొచ్చారు నాగబాబు. అయితే నాకు బాబు ఇది ఎవరినొ ఉద్దేశించి రాసి ఉంటారని.. ఇక ఇలా రాసింది అయిన వాళ్ల గురించి అయి ఉండవచ్చు అంటూ ఒక ప్రచారం మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: