తమిళ నటుడు విశాల్ తాజాగా మార్క్ ఆంథోనీ అనే యాక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే భారీ ఎత్తున మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల అయింది.

ఇకపోతే మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన ఈ సినిమాకు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమా అమెజాన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ లో విశాల్ మరియు ఎస్.జే సూర్య మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు అయినటువంటి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: