రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అటు రామ్ ... ఇటు బోయపాటి ఇద్దరి కెరియర్ లోను మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బిజియేస్ట్ నటిమని శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రిన్స్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈ మూవీ మేకర్స్ చాలా రోజుల క్రితమే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించి అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీని సెప్టెంబర్ 15 వ తేదీ నుండి సెప్టెంబర్ 28 వ తేదీకి వాయిదా వేయడంతో ఈ సినిమా ట్రైలర్ విడుదలకు ఈ మూవీ విడుదల కు మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది.

దానితో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ను విడుదల చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం మొదట విడుదల చేసిన ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలపై ప్రత్యేక దృష్టిని పెట్టగా ... ఈ మూవీ రెండవ ట్రైలర్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ రెండవ ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: