తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో హీరో గా నటించి నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి ఆ మూవీ లతో కూడా మంచి విజయాలను అందుకొని దర్శకుడి గా కూడా తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. 

ఇకపోతే ఈ నటుడు తాజాగా గామీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో చాందిని చౌదరి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... విద్యాధర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే తాజాగా విశ్వక్ సేన్ కెరియర్లో 12 వ మూవీ గా రూపొందుతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను చిత్ర బృందం విడుదల చేసింది. విశ్వక్ కెరీర్ లో 12 వ మూవీ గా రూపొందుతున్న సినిమాకు "మెకానిక్ రాఖీ" అనే టైటిల్ ను చిత్ర బృందం కన్ఫామ్ చేస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇందులో విశ్వక్ ఓ భారీ రేంజ్ ను పట్టుకొని నిల్చోని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ నీ రామ్ తల్లూరి నిర్మించండగా ... రవితేజ మాలపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs