
చిరంజీవి , బాలకృష్ణతో మళ్ళీ సినిమాలు చేయటం గురించి విజయశాంతి మాట్లాడుతూ , ఇకపై తాను ఎవరితో సినిమాలు చేయనని కూడా భారీ స్టేట్మెంట్ ఇచ్చింది .. తాను ఇక ముందు ముందు సినిమాలో చేయబోనని కూడా క్లారిటీ ఇచ్చింది .. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంపికైన నేపథ్యం లో ఆమె బాధ్యతలు బాగా పెరిగాయి అలాగే ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉంటుంది .. ఇలాంటి క్రమంలో సినిమాలు చేయడానికి అసలు వీలు ఉండదని , అందులోనూ చిరంజీవి , బాలకృష్ణతో సినిమాల చేసే అవకాశం లేదని , ఇకపై అసలు సినిమాలు చేయటం కుదరదు అనే విషయం పై కూడా ఈ లేడీ సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చింది .. ఇక విజయశాంతి గ్యాంగ్ లీడర్, యముడికి మొగుడు, స్వయం ఖుషి, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ, కొండవీటి రాజా, మెకానిక్ అల్లుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, మహానగరంలో మాయగాడు, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, రుద్రవీణ, మంచి దొంగ, సంఘర్షణ, దేవాంతకుడు, చాణక్య శపథం, యుద్దభూమి, ధైర్యవంతుడు, ఛాలెంజ్, చిరంజీవి, ధర్మయుద్దం వంటి సినిమాల్లో కలిసి నటించారు ..
ఇక అలానే విజయశాంతి బాలకృష్ణతో .. రౌడీ ఇన్స్‌పెక్టర్, లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, నిప్పురవ్వ, భార్గవ రాముడు, మువ్వ గోపాలుడు, అపూర్వ సహోదరులు, ముద్దుల కృష్ణయ్య, సాహస సామ్రాట్, భానుమతి గారి మొగుడు, ముద్దుల మేనల్లుడు, భలే దొంగ, ఇన్స్ పెక్టర్ ప్రతాప్, తల్లి తండ్రులు, దేశోద్ధారకుడు, పట్టాభిషేకం, రౌడీ రాణి, `కథానాయకుడు`వంటి సినిమాల్లో కలిసి నటించారు .. అయితే ప్రస్తుతం విజయశాంతి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ కు తల్లిగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా యాక్షన్ రోల్లో కనిపించబోతుంది .. ఏప్రిల్ 18 అనగా రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో విజయశాంతి చురుగ్గా పాల్గున ఈమె చిరంజీవి బాలకృష్ణకు సంబంధించి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది .. ప్రస్తుతం విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి ..