ఈ మధ్య కాలంలో ఓ టీ టీ లోకి సినిమాలు చాలా తక్కువ కాలం లోనే ఎంట్రీ ఇస్తున్నాయి. కొన్ని భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలను 50 రోజుల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇక మరికొన్ని సినిమాలు నెల రోజుల రన్ టైమ్ కంప్లీట్ అయ్యాక ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా తక్కువగా సమయంలోనే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అలా తక్కువ సమయంలో ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తున్న కొన్ని సినిమాలు థియేటర్లలో మంచి కలెక్షన్లు దక్కించుకుంటున్న సమయంలోనే ఓ టీ టీ లోకి వచ్చేస్తున్నాయి.

ఇకపోతే తాజాగా విడుదల అయిన ఓ స్టార్ హీరో సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లను రాబడుతున్న వేళ ఆ మూవీ ఓ టి టి విడుదల తేదీ వచ్చేసింది. అసలు విషయం లోకి వెళితే ... మలయాళ నటుడు మోహన్ లాల్ తాజాగా L2 ఎంపురాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. పృథ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మార్చి 27 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. ఇక ఈ మూవీ విడుదల అయిన నెల రోజుల్లోపే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని ఏప్రిల్ 24 వ తేదీ నుండి మలయాళ , తమిళ్ , తెలుగు , కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ ఓ టి టి సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. అలా మంచి కలెక్షన్లు దక్కుతున్న సమయంలోనే ఈ మూవీ ఓ టి టి విడుదల తేదీ వచ్చేసింది. మరి ఓ టి టి విడుదల తేదీ రావడంతో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది అది చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: