సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం అనేక మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మందికి నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం , అదిరిపోయే రేంజ్ గుర్తింపు వస్తూ ఉంటుంది. మరి కొంత మంది కి మొదటి సినిమాతో పెద్ద స్థాయి విజయాలు దక్కకపోయినా , పెద్ద రేంజ్ గుర్తింపు రాకపోయినా ఆ తర్వాత వారు మంచి సినిమాల్లో మంచి గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదిగిన వారు కూడా ఉన్నారు.

ఇకపోతే మరి కొంత మందికి మాత్రం మొదటి సినిమా కూడా విడుదల కాకముందే అదిరిపోయే రేంజ్ లో గుర్తింపు వస్తూ ఉంటుంది. అలా మొదటి సినిమా కూడా విడుదల కాకముందు ఓ ముద్దుగుమ్మ నటించిన సినిమా నుండి ఓ చిన్న వీడియోని విడుదల చేయగా ఆ వీడియో ద్వారానే ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఓరు అడార్ లవ్ అనే సినిమాతో హీరోయిన్గా వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ విడుదల కాకముందు ఈ సినిమా నుండి మేకర్స్ ఓ చిన్న వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో ఈమె తన క్యూట్ లుక్స్ తో మరియు స్మైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఒక్క సారిగా ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

అలాగే ఈ సినిమా గురించి కూడా జనాలకు కూడా తెలిసింది. దానితో ఈ మూవీ ని తెలుగులో లవర్స్ డే అనే పేరుతో విడుదల చేశారు. ఒక చిన్న వీడియోతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చిన ఆ తర్వాత ఈమెకు ఆ సినిమా ద్వారా పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాల్లో నటించిన ఆమెకు అద్భుతమైన గుర్తింపు దక్కలేదు. దానితో ఈమె ప్రస్తుతం చాలా స్లో గా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ppv