ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణిపై తాజాగా ఓ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన ఓ వ్యభిచారి..స్కూల్ గర్ల్స్ ని సప్లై చేసేవాడు అంటూ చాలా హీనంగా మాట్లాడారు. మరి ఇంతకీ కీరవాణి పై అలాంటి అణుచిత వ్యాఖ్యలు చేసిన ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో కొంతమంది ఇండస్ట్రీ నుండి ఫెడౌట్ అయ్యాక పాపులారిటీ కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నారు.అలాంటివారిలో డైరెక్టర్ గీతాకృష్ణ ఒకరు.ఈయన ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలపై అణుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ అభిమానులతో విమర్శల పాలైన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల రహస్య బాగోతాలు బయట పెట్టడమే కాకుండా వారి గురించి లేనివి కూడా ఉన్నట్లు క్రియేట్ చేసి చెప్పడంతో గీతాకృష్ణ మాటల్ని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా ఎంఎం కీరవాణి ఓ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 

పాడుతా తీయగా షోలో జూనియర్ సింగర్ ప్రవస్తి సునీత,కీరవాణి, చంద్రబోస్ వంటి సింగర్స్ పై షాకింగ్ కామెంట్లు చేసింది. అయితే తాజాగా ఈ వివాదం గురించి స్పందించిన డైరెక్టర్ గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రవస్థికి మద్దతుగా మాట్లాడుతూ కీరవాణి మనం అనుకున్నంత మంచివాడు కాదు. ఆయన 8 ఏళ్లగా నాకు పరిచయం.ఆయన భాగోతాలన్నీ నాకు తెలుసు.అయితే ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి ఆయన నిజ స్వరూపం తెలుసు. ఎంతోమంది ఆయన్ని డైరెక్ట్ గానే తిట్టి దుమ్మెత్తి పోస్తారు. ఆయన ఓ వ్యభిచారి.. అమ్మాయిలను సప్లై చేసే వారి దగ్గరికి వెళ్లి స్కూల్ అమ్మాయిలు కావాలని అడిగారట.. ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు కాబట్టి ఎక్కువగా మాట్లాడడం లేదు.కానీ అతని వేషాలన్నీ నాకు తెలుసు. కానీ ఈ విషయాల గురించి మనకెందుకులే అని నేను పట్టించుకోను.

సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ఫీల్డ్ కాదు అనే విషయం కీరవాణి తెలుసుకోవాలి అంటూ గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ప్రవస్థి ని సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసుకొని అది ఆయన ఇష్టం.కానీ ఇలా కీరవాణిపై లేనిపోని ఆరోపణలు చేసి ఆయన వ్యభిచారి అని స్కూల్ గర్ల్స్ ని సప్లై చేయాలని, అతనిపై  ఫోక్సో కేస్ పెట్టాలని మాట్లాడటం మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి.ఈ మాటల పట్ల కీరవాణి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆరోపణలు చేయాలి కానీ అవి హద్దులు మీరకూడదు. లేనిపోని రూమర్ల క్రియేట్ చేస్తే వారి జీవితానికి అవి ఎంత ఎఫెక్ట్ చేస్తాయో ముందుగా గుర్తించుకోవాలి.ఆయనపై ఫోక్సొ  కేసు కాదు నీ మీద పెడతారు చూసుకో అంటూ గీత కృష్ణని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు.మరి గీతాకృష్ణ చేసిన ఈ షాకింగ్ ఆరోపణల పై ఎం ఎం కీరవాణి రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: