టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో మాస్ ప్రేక్షకుల్లో ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ భార్య పేరు లక్ష్మీ ప్రణతి కాగా ఈ జోడీ చూడముచ్చటగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి పెళ్లి జరిగి నేటికి 14 సంవత్సరాలు కాగా ఈ జోడీ చూడముచ్చటగా ఉంటుందని ఫ్యాన్స్ ఫీలవుతారు. వాస్తవానికి ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి పెళ్లి ఫిక్స్ అయిన సమయంలో లక్ష్మీ ప్రణతి మైనర్ అని ఒక వివాదం తలెత్తింది.
 
అయితే లక్ష్మీ ప్రణతికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే తారక్ పెళ్లి చేసుకున్నారు. తారక్ ప్రణతిల పెళ్లి వేడుకకు రికార్డ్ స్థాయిలో అభిమానులు హాజరయ్యార్. పెళ్లి సమయంలో లక్ష్మీ ప్రణతి ధరించిన చీర ఖరీదు ఏకంగా కోటి రూపాయలు కాగా ఆ చీర సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా కూతురు పుట్టి ఉంటే బాగుండేదని ఎన్టీఆర్ పలు సందర్భాల్లో ఫీలయ్యారు.
 
అప్పట్లో ఈ పెళ్లి వేడుకకు 3,000 మంది అతిథులు 12,000 మంది అభిమానులు హాజరయ్యారు. కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకునే భార్య కావాలని కోరుకున్న తారక్ కు ప్రణతి రూపంలో మంచి భార్య దొరికింది. జూనియర్ ఎన్టీఆర్ కు పెళ్లి తర్వాత కెరీర్ పరంగా మరింత కలిసొచ్చిందని భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాయని తెలుస్తోంది. తారక్ పెళ్లి వేడుకలో పెట్టిన వంటకాలు సైతం హాట్ టాపిక్ అయ్యాయి.
 
లక్ష్మీ ప్రణతి ఇంట్రావర్ట్ కాగా ఆమె సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండరు. ఎన్టీఅర్ సినిమాలో అయినా లక్ష్మీ ప్రణతి కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వార్2, డ్రాగన్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వార్2 ఈ ఏడాదే రిలీజ్ కానుండగా డ్రాగన్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: