దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి జరగాల్సిన సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయని సమాచారం అందుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పరీక్షల వాయిదాకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నెల 9వ తేదీ నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
 
ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం పరీక్షకు నమోదు చేసుకునే అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ ను తనిఖీ చేసుకోవడం ద్వారా ఏవైనా సందేహాలు ఉంటే సులువుగా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐసీఏఐ సీఏ పరీక్షలు మే 2వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు జరగాల్సి ఉండగా గ్రూప్1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీలలో గ్రూప్2 పరీక్షలు మే 2,4,6 తేదీలలో నిర్వహించాల్సి ఉంది.
 
గ్రూప్1 తుది పరీక్ష మే 2, 4, 6 తేదీలలో జరగాల్సి ఉండగా గ్రూప్2 పరీక్ష మే 8, 10, 13 తేదీలలో నిర్వహించనున్నారు. అనంతరం జరగనున్న పరీక్షలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయని సమాచారం అందుతోంది. ఈ పరీక్షలు వాయిదా పడటం లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.
 
మన దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో సీఏ ఒకటని చెప్పడానికి ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. సీఏ పరీక్షల్లో పాస్ అయ్యి భవిష్యత్తులో కన్న కలలను నెరవేర్చుకోవాలని ఎంతోమంది విద్యార్థులు కృషి చేస్తున్నారు. అయితే అతి త్వరలోనే వీటికి సంబంధించిన  కొత్త షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉండటంతో విద్యార్థులకు మరీ ఇబ్బందులు అయితే ఉండబోవని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: