టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో చరణ్ ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా నటించాడు. తండ్రి పాత్రలో నటించిన చరణ్ కి జోడిగా అంజలి నటించగా ... కొడుకు పాత్రలో నటించిన చరణ్ కు జోడిగా కియార అద్వానీ నటించింది. ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించగా ... శ్రీకాంత్ , బ్రహ్మానందం , సునీల్ , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.

ఇకపోతే భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన పెద్ద ఎత్తున తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర భారీ స్థాయిలో నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ జీ తెలుగు ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయింది. మొదటి సారి బుల్లి తెరపై ప్రచారం అయినప్పుడు ఈ మూవీ కి కేవలం 5.02 టీఆర్పీ రేటింగ్ మాత్రమే దక్కింది. దానితో ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడంలో విఫలం అయింది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: