
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తాజాగా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్.ఆర్.ఆర్ మూవీ స్కీనింగ్ తో పాటు కీరవాణి లైవ్ కాన్సెర్ట్ జరిగింది. అశాంతి ఓంకార్ ఈ ఈవెంట్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించడం గమనార్హం. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నాటు నాటు పాటలో నా ఫ్రెండ్, అద్భుతమైన డ్యాన్సర్ చరణ్ తో కలిసి డ్యాన్స్ చేయడాన్ని మరిచిపోలేనని చెప్పుకొచ్చారు. చిరంజీవి గారు గ్రేట్ డ్యాన్సర్ అని బాలయ్య సైతం మంచి డ్యాన్సర్ అని తారక్ అన్నారు. చిరంజీవి, బాలయ్య బాబాయ్ కలిసి నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేస్తే అది జ్ఞాపకంగా నిలిచిపోతుందని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తారక్ సినిమాలన్నీ టాప్ బ్యానర్లలో తెరకెక్కుతుండగా ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.