
ఇక ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల అయ్యిందో.. లేదో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో ఈ మూవీ టీజర్ కు 10 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అలాగే డైలాగ్స్ ఉంటాయని మూవీ మేకర్స్ తెలిపారు. టీజర్ చూడగానే విజయ్ అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా వేసవి సెలవులలో మే 30న రిలీజ్ అవ్వనుంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో విజయ్ ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆయనకు ఒకే ఒక జీవితం సినిమాలో నటించేందుకు ఛాన్స్ వచ్చిందని అన్నారు. ఆ సినిమా స్క్రిప్ట్ ను ఆయన మూడుసార్లు విన్నట్లు తెలిపారు. ఆయనకి సినిమా చాలా నచ్చిందట. కానీ ఆ సినిమాకు తన బాడీలాంగ్వేజ్ సరిపోలేదనిపించి.. ఆ సినిమాలో నటించలేకపోయారని విజయం చెప్పుకొచ్చారు. ఇక ఆ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అక్కినేని అమల ఈ సినిమాలో అమ్మగా ముఖ్య పాత్రను పోషించారు.