
ఈరోజు తాను చాలా సంతోషంగా ఉన్నానని, దాదాపు 12 సంవత్సరాల తర్వాత తన ఫోన్ విజయంతో మోగుతూనే ఉందని మనోజ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కథలో తనను భాగం చేసినందుకు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. "మీరు నన్ను మాత్రమే నిలబెట్టలేదు, నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు" అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. 'మిరాయ్' సినిమా విజయం తన జీవితంలో ఒక మలుపు అని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని మనోజ్ తెలిపారు. ఈ విజయం తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు అంకితం అని పేర్కొన్నారు.
చాలా సినిమాలు చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యాయని ఒకటి అనుకుంటే మరొకటి జరిగేదని అలాంటి సమయంలో కార్తీక్ ఘట్టమనేని నన్ను నమ్మారని మంచు మనోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను పెరిగినట్లు నా పిల్లల్ని పెంచగలనా అనే భయం ఉండేదని మనోజ్ పేర్కొన్నారు. ఆ భయాన్ని కార్తీక్ ఘట్టమనేని పోగొట్టారని మంచు మనోజ్ పేర్కొన్నారు. నిర్మాత కూడా ఎంతో ధైర్యంగా సినిమాను నిర్మించారని మనోజ్ తెలిపారు.
మంచు మనోజ్ తో సినిమా వద్దని ఆయనకు ఎంతోమంది చెప్పి ఉంటారని ఆ మాటలను పట్టించుకోకుండా విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారని మంచు మనోజ్ కామెంట్లు చేశారు. మిరాయ్ విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ తెలుగు సినిమా గర్వపడేలా చేసిందని ప్రతి ఇంట్లో మనోజ్ గెలవాలని కోరుకున్న వాళ్లకు పేరుపేరునా పాదాభివందనం అని మనోజ్ అన్నారు. మిరాయ్ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.