బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయీ అంటే తెలియని వారు ఉండరు.ఈయన తన సినిమాలతో ఎప్పుడు ఇండస్ట్రీలో కొత్తదనాన్ని తీసుకువస్తూ ఉంటారు. అయితే అలాంటి మనోజ్ బాజ్పేయి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు బాలీవుడ్లో దుమారం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈయన మాట్లాడిన మాటలు స్పెషల్ గా కొంత మందిని టార్గెట్ చేసినట్టు ఉన్నాయంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ మనోజ్ బాజ్పేయి మాట్లాడిన మాటలు ఏంటి? ఎందుకు నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి మాట్లాడారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనోజ్ బాజ్పేయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలోకి పియూష్ లాంటి గొప్ప నటులు నటనలో శిక్షణ తీసుకొని వచ్చారు. 

కానీ ఆయన తర్వాత వచ్చిన నటులను గొప్ప నటులు అని పొగడడం నిజంగా ఆయన్ని అవమానించినట్లే అవుతుంది. నా వరకు వస్తే నేను ఈ సినిమాలో గొప్పగా నటించాను అద్భుతంగా నటించాను అని అనుకునే లోపే మరో పిఆర్టి టీం వేరే నటుడిని వైరల్ చేస్తూ వాళ్లే గొప్ప అంటూ హైలెట్ చేస్తున్నారు.. ఇలా రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ ట్యాగులు అందుకోవడం ఏంటో నాకైతే అర్థం అవ్వడం లేదు. గతంతో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. ఒకరు బాగా చేశారు అనుకునే లోపే మరొకరికి పేరు వస్తే యాక్టింగ్ బాగా చేసిన వారు గుర్తింపుకి నోచుకోవడం లేదు.ఇలాంటి సంస్కృతి నాకు అసలు నచ్చడం లేదు.

ఇలా రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ లు పుట్టుకు రావడం పై నాకు చిరాకు వేస్తుంది అంటూ మనోజ్ బాజ్పేయి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మనోజ్ బాజ్పేయి నేషనల్ క్రష్ ట్యాగ్ అనే అంశాన్ని ప్రస్తావించడంతో చాలామంది నెటిజన్లు నేషనల్  క్రష్ అనగానే రష్మిక మందన్నా పేరుని ఇందులోకి తీసుకువస్తున్నారు.అయితే రష్మికను ఉద్దేశించి మాట్లాడక పోయినప్పటికీ కొంతమంది గాసిప్ రాయుళ్లు మాత్రం ఇందులో రష్మిక నే విమర్శించినట్టు కామెంట్లు చేస్తున్నారు. కానీ మనోజ్ బాజ్పేయి నేషనల్ క్రష్ ట్యాగుల గురించి గొప్ప నటులకు గుర్తింపు రావడం లేదు అనే దాని గురించి స్పందించారు.ఇక మనోజ్ భాజ్పేయి ప్రస్తుతం డైరెక్టర్ ఆర్జీవి దర్శకత్వంలో పోలీస్ స్టేషన్ మే బూత్ అనే హారర్ సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: