`తండేల్‌` మూవీతో వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య.. ప్ర‌స్తుతం సుకుమార్ శిష్యుడు కార్తీక్‌ వర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మైథలాజికల్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కార్తీక్ దండు గ‌త చిత్రం `విరూపాక్ష‌` సూప‌ర్ హిట్ కావ‌డంతో అత‌ని తాజా చిత్రంపై కూడా మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. `ఎన్‌సీ24` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ మూవీలో చైతూ ఒక ట్రెజ‌ర్ హంట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు.


అలాగే ఎన్‌సీ24లో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా ఎంపిక అయింది. ఆమె ఆర్కియాల‌జిస్ట్ క్యారెక్ట‌ర్ లో అల‌రించ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ప్ర‌త్యేకంగా వేసిన సెట్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. వృషకర్మతో స‌హా మ‌రో రెండు ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ ను ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఎన్‌సీ24 మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది.


ఈ మిస్ట‌రీ థిల్ల‌ర్ లో మెగా ఫ్యామిలీకి చెందిన ఓ హీరో స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వ‌నున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు సాయి దుర్గ తేజ్‌. క‌థ‌లో భాగంగా సినిమాలో మరో హీరో పాత్ర ఉంటుంది. ఈ పాత్ర కోసం డైరెక్ట‌ర్ కార్తీక్ దండు సాయి దుర్గ‌ తేజ్‌ను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు చైతూ మూవీలో తేజ్ క్యారెక్ట‌ర్ చాలా ఫ్రెష్‌గా, డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని కూడా టాక్ న‌డుస్తోంది. ఇక నాగ‌చైత‌న్య సినిమాలో తేజ్ యాక్ట్ చేయ‌బోతున్నాడ‌నే వార్త తెర‌పైకి రాగానే వాట్ ఏ కాంబినేష‌న్ గురూ అంటూ సినీ ప్రియులు ఆభిప్రాయ‌ప‌డుతుండ‌టం విశేషం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: