
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సినిమా కింగ్‌డమ్. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టు కునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే కింగ్‌డమ్ ప్రస్తుతం రీ షూట్లు జరుపుకుంటున్నట్టు సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కింగ్ డమ్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిందని .. అయితే ఫైనల్ అవుట్ పుట్ లో కొన్ని సీన్లు బాగా రాలేదని దానికోసం మళ్లీ ఆ సీన్లు రీ షూట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. సినిమా అవుట్ ఫుట్ మరింత బెటర్ గా రావాలని మేకర్స్ భావిస్తున్నారట.
మరి ఈ రీ షూట్లు సినిమా కు ఎంత వరకు హెల్ఫ్ అవుతాయో ? చూడాలి. కెరీర్ లో ఎప్పుడు లేనట్టుగా సరికొత్త పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తుండగా ... అందాల భామ భాగ్యశ్రీ పూర్ణ హీరోయిన్గా నటిస్తోంది. కింగ్‌డమ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవురా నాగ వంశీ , దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 4న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు