డైరెక్టర్ శ్రీను వైట్లను తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీను వైట్ల.. 1999లో `నీకోసం` మూవీతో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రవితేజ, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం యావరేజ్ గా ఆడినప్పటికీ.. శ్రీను వైట్ల రెండో సినిమా `ఆనందం`, మూడు సినిమా `సొంతం` హిట్స్ గా నిలిచాయి. 2004లో `వెంకీ` రూపంలో శ్రీ‌ను వైట్ల‌కు బ్లాక్ బస్టర్ ప‌డింది. `ఢీ`, `దుబాయ్ శీను`, `రెడీ` వంటి చిత్రాలు శ్రీను వైట్లకు మరింత క్రేజ్‌ తెచ్చి పెట్టాయి.


అయితే దశాబ్ద కాలం నుంచి శ్రీను వైట్ల మెల్లగా ఫేడవుట్ అవుతూ వచ్చారు. ఆయన ఖాతాలో ఫ్లాప్ తప్ప హిట్ అనేది పడలేదు. లాంగ్ గ్యాప్ అనంత‌రం గ‌త ఏడాది `విశ్వం` మూవీతో శ్రీ‌ను వైట్ల మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. కానీ నిరాశే ఎదురైంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. శ్రీ‌ను వైట్ల డైరెక్ట్ చేసిన వెంకీ మూవీ రీరిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే శ్రీ‌ను వైట్ల ప‌లు ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటున్నారు.


అయితే గ‌తంలో శ్రీ‌ను వైట్ల‌కు రూ. 2 వేల కోట్లు ఆస్తులు ఉన్నాయ‌ని.. టాలీవుడ్ లోనే ఆయ‌నే రిచ్చెస్ట్ డైరెక్ట‌ర్ అని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారంపై తాజాగా శ్రీ‌ను వైట్ల రియాక్ట్ అయ్యారు. `రూ. 2 వేల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి అన్న‌ది అవాస్తవం. అంత‌ సీన్ నాకు లేదు. ఒక‌వేళ రిచ్చెస్ట్ డైరెక్ట‌ర్ అయితే హ్యాపీనే. డ‌బ్బు క‌న్నా సినిమాకే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చే వ్య‌క్తి నేను. నిజాయితీగా కష్టపడడం వ‌ల్లో ఏమో.. నేనెక్క‌డ ఇన్వెస్ట్ చేసినా లాభాలే వ‌చ్చాయి. అలాగ‌ని రియల్ ఎస్టేట్ లో సంపాదించాను అనుకుంటే పొర‌పాటే.. ల్యాండ్స్ మీదే నేను ఇన్వెస్ట్ చేశాను. పొలాలు బాగా కొన్నాను. ప్ర‌స్తుతం నా ఫ్యామిలీ ఏ లోటు లేకుండా ఫుల్ హ్యాపీగా ఉంది. పైగా నాకెలాంటి వ్య‌స‌నాలు లేవు. డ‌బ్బులు కూడా దుబారా చేయ‌ను. అలా అని పిసినారి కాదు` అంటూ శ్రీ‌ను వైట్ల చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: