నందమూరి అందగాడు నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం .. ఫుల్ ఫామ్ లో వ‌రుపస‌ విజయాలతో దూసుకుపోతున్నాడు ..  ఒకపక్క వెండితెరపై రికార్డులు క్రియెట్‌ చేస్తూ .. మరోపక్క రాజకీయాల్లో సంచలనాలు క్రియేట్ చేస్తున్న నందమూరి హీరో పుట్టినరోజు నేడు .. తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా నటనని మాత్రమే కాదు .. సేవ గుణాన్ని కూడా అందిపుచ్చుకున్నారు .. ప్రధానంగా తల్లి కోరిక మేరకు స్థాపించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ .. తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు .. ఈరోజు బాలయ్య పుట్టినరోజు కావడంతో హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ ను సందర్శించారు .  ఇక తన 65వ జన్మదిన వేడుకలను క్యాన్సర్ బాధ్యతలు మధ్య ఎంతో ఘనంగా జరుపుకున్నారు .


ఇక బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ఆవరణలో ఉన్న తన తల్లిదండ్రుల నందమూరి తారకరామారావు , బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బాలయ్య .. అలాగే క్యాన్సర్ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసిన బాలకృష్ణ .. ఆ తర్వాత అక్కడ ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు .  ఇక తన జన్మదినం సందర్భంగా బాలకృష్ణకి శుభాకాంక్షలు చెప్పేందుకు బసవతారకం ఆసుపత్రికి అభిమానులకు భారీగా తరలి వచ్చారు .  ఈ క్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ పలు సంచలన విషయాలు చెప్పారు .  ప్రధానంగా తన తల్లిదండ్రుల కోరికను ఈరోజు గుర్తు తెచ్చుకున్నారు.


అలాగే తన జీవితం తెరిచిన పుస్తకం అని ...   ఎక్కడ రహస్యాలు లేవని కూడా చెప్పారు .. పేదలకు అందుబాటులో వైద్యం అందించాలని మా అమ్మగారి కోరిక .. అందుకని ఈ ఆసుపత్రిని స్థాపించి సేవ చేయడం మొదలుపెట్టాం అంతేకాకుండా తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ తనని డాక్టర్ చదివించాలని అనుకున్నారని .. ఈ క్రమంలోనే తన చదువు విద్యాభ్యాసం గురించి గుర్తు చేసుకున్నారో బాలయ్య ..  నా తండ్రి తనను మెడిసిన్ చేయమన్నారు .. అలాగే ఎంబిబిఎస్ చేరడానికి అప్లై చేసి హాల్ టికెట్ తెచ్చి ఇచ్చారు .. అయితే తనకు నటన మీద ఇంట్రెస్ట్ ఉండడంతో చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ని తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

 

అలాగే తన ఆలోచనలు ఎప్పటికప్పుడు షార్ప్ చేసుకుంటూ కాలానికి అనుగుణంగా వెళ్తానని కూడా చెప్పుకొచ్చాడు .  అందరూ తను చూసి పొగురు ఉందని అనుకుంటారు .  అలా అనుకునేది నిజమే నాకు పొగరు ఉంది .. అది కూడా నన్ను చూసుకొనే నాకు పొగరు అని కూడా చెప్పుకొచ్చారు .. ఎందుకంటే నేను ముందు నన్ను ప్రేమించకుంటా .. ఆ తర్వాతే మిగిలిన వారు అని కూడా చెప్పుకొచ్చారు .. అదే విధంగా తనకు బిరుదులు అలంకారం కాదని ఆ బిరుదులకే తాను అలంకారమని కూడా చెప్పుకోచ్చారు .. తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డు గురించి కూడా మాట్లాడుతూ .  ఈ అవార్డు తాను చేసిన సేవలకు దక్కిన గొప్ప పురస్కారం అని ఎవరికైనా సరే మన శరీరం అదుపు ఆజ్ఞల్లో ఉండాలి .  ఈ గుణం హిందూ ధర్మాల్లో ఉంది .. అంతేకాకుండా హిందూ ధర్మంలో మరొక గొప్పతనం అందరూ బాగుండాలని కోరుకోవటం అని బాలయ్య చెప్పుకొచ్చారు .

మరింత సమాచారం తెలుసుకోండి: