`మ్యాడ్` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కేరళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్.. ఇప్పుడు `8 వసంతాలు` అనే మూవీతో రాబోతోంది. స్వచ్ఛమైన ప్రేమ కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి డైరెక్టర్ కాగా.. అనంతిక మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ వంటి టాప్ బ్యాన‌ర్ పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఈ మూవీని నిర్మించారు. జూన్ 20న విడుద‌ల కాబోతున్న 8 వసంతాలు.. సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వ‌బోతుంద‌ని టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో స్ప‌ష్ట‌మైంది.


మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉన్న ఓ రచయితగా అనంతిక ఈ చిత్రంలో అల‌రించ‌నుంది.  రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అనంతిక బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటోంది. సినిమాకు సంబంధించి అనేక విశేషాల‌ను పంచుకుంటూ మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మెరిసిన అనంతిక సనీల్ కుమార్.. త‌న మ‌న‌సులో ఉన్న క్రేజీ కోరికను బ‌య‌ట‌పెట్టింది.


న‌టి కాక‌పోయుంటే ఏం అయ్యేశారు? అన్న ప్ర‌శ్న‌కు అవంతిక ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. పొలిటీషియ‌న్ అవ్వాల‌నేది అవింతిక డ్రీమ్ అట‌. అందుకోస‌మే ఆమె లా కూడా చ‌వుతుంద‌ట‌. అయితే పాలిటిక్స్ లోకి ఇప్పుడు కాదు 40 ఏళ్లు వ‌చ్చాక వెళ్లాల‌ని ఉంద‌ని అవంతిక చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, అనంతిక సనీల్ కుమార్ మ‌ల్టీ టాలెంటెడ్ బ్యూటీ. 5 సంవత్సరాల వయస్సులోనే అనంతిక శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడం ప్రారంభించింది. కథాకళి, భరతనాట్యం, మోహినియాట్టం మరియు కూచిపూడితో సహా అనేక శాస్త్రీయ నృత్య రూపాల్లో ఆమె శిక్షణ పొందారు. అలాగే కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఆమె. కేరళలో ఉద్భవించిన భారతీయ యుద్ధ కళ కలరిప్పయట్టును కూడా అనంతిక అభ్య‌సించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: