- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపించి చాలా వారాలు అవుతోంది. సమ్మర్ అంతా పెద్ద హీరోల సినిమాలు లేక సరైన సినిమాలు లేక థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి వాతావరణం నుంచి ఎట్టకేల‌కు ఈ వారం కాస్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ వారం అంచనాలు ఉన్న మూడు సినిమాలు ధియేటర్ లోకి దిగుతున్నాయి. ఒకటి బాలీవుడ్ సినిమా మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగులో కుబేర - ఎనిమిది వసంతాలు విడుదలవుతున్నాయి. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు ఏ క్లాస్ సెంటర్లలో బాగా చూస్తారు. ఈసారి ఆయన బీ , సీలను టార్గెట్ చేస్తూ సినిమా తీశారు. నాగార్జున - ధనుష్ - రష్మిక లాంటి భారీ తారాగణంతో కుబేర సినిమా తెరకెక్కింది. పైగా ఏషియన్ సునీల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


పైగా మూడు గంటల నిడివి కాస్త భయపెడుతోంది. తమిళంలో ప్రీ బుకింగ్ బాగున్న వాళ్ళు ఈ సినిమాను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారని ప్రశ్న కూడా ఉంది. ఇక మైత్రి మూవీస్ నిర్మించిన ఎనిమిది వసంతాలు కూడా ఈ వారం రిలీజ్ అవుతుంది. ఇదిగో ఫీల్ గుడ్ ప్రేమ కథ. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మైత్రి వాళ్ళు ఉన్నారు కాబట్టి థియేటర్లకు ఇబ్బంది లేదు.


అమీర్ ఖాన్ ‘ సితారే జ‌మీన్‌ప‌ర్ ’ కూడా ఈవార‌మే వ‌స్తోంది. ఇంకా చాలా కాలంగా ఆయ‌న‌కు ప్లాపులే త‌గులుతున్నాయి. ఓటీటీకీ సినిమా అమ్మ‌కుండా ఆయ‌న ప‌ట్టుద‌ల చూపించారు. వ‌చ్చే ఆదాయం అంతా థియేట‌ర్ల నుంచే రావాలి. చిన్న సినిమా కావ‌డంతో అమీర్ సింపుల్‌గా సేఫ్ అవుతార‌ని అంటున్నారు. సౌత్‌లో అస‌లు అమీర్ ప్ర‌చార‌మే చేయ‌లేదు. మ‌రి సౌత్‌లో ఈ సినిమా థియేట‌ర్ల‌ను ఎంత వ‌ర‌కు ఫుల్‌ఫిల్ చేస్తుందో ?  చూడాలి. ఏదేమైనా ఈ వారం ఈ మూడు సినిమాల‌తో బాక్సాఫీస్ కాస్త క‌ళ‌క‌ళ‌లాడుతున్నా.. ఏవి హిట్లు అవుతాయి.. ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తాయి అన్న‌ది చూడాలి.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: