
అయితే సినిమాలో హీరో గా తన అభిమానుల కోసం చేస్తున్నానని లేదంటే దర్శకత్వాన్ని ఎంచుకుంటానని ధనుష్ చెప్పుకొచ్చారు .. ఇక దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .. ఇప్పటికే కుబేర సినిమా ట్రైలర్ , టీజర్ ఇలా అన్ని ప్రమోషనల్ కంటెంట్స్ తో సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు .. ధనుష్ తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో చేస్తున్నా తొలి సినిమా కావటంతో .. అలాగే ఇందులో ధనుష్ తో పాటు స్టార్ హీరో నాగార్జున , రష్మిక మందన్న వంటి వారు కూడా కీలక పాత్రలో నటించడం తో మొదటి నుంచి ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి .. అందుకు తగ్గట్టు గానే డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా సినిమాను ఊహించని రేంజ్ లో భారీగానే తెరకెక్కించాడు .. ఇక మరి ఈ నెల 20 న కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఇక మరి థియేటర్‌ల్లో కుబేర ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు