ప్రస్తుతం తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ దృష్టి అంతా ఒక రెండు భారీ సినిమాల పైనే ఉంది. పాన్ ఇండియా సినిమాలుగా భారీ బడ్జెట్ తో నిర్మింప బడ్డ ఆరెండు సినిమాలు ఇప్పటికే అనేకసార్లు రకరకాల కారణాలతో తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటూ వచ్చాయి.


పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘హరిహర వీరమల్లు’ విజయ్ దేవరకొండ అభిమానులు చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్న ‘కింగ్ డమ్’ మూవీలు రెండు ఇప్పుడు ఒకదానిపై ఒకటి పోటీ పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మూవీతో మరో భారీ సినిమా పోటీ పడటానికి సాహసం చేయదు.


అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లుతో’ పోటీగా విడుదల కావడానికి ఓటీటీ సంస్థల ఒత్తిడి అని అంటున్నారు. భారీ సినిమాలకు ఓటీటీ సంస్థల నుండి వచ్చే ఆదాయం ప్రధాన మార్గంగా మారడంతో ఓటీటీ సంస్థలు చెపుతున్న అన్ని కండిషన్స్ కు భారీ సినిమాల నిర్మాతలు రాజీ పడవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు.  


ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారంమేరకు పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ జూలై 24న విడుదలకాబోతోంది అని తెలుస్తోంది.  లాక్ చేసుకుందట. ఇంతకు ముందు జూలై 18 అని వార్తలు వచ్చాయి కానీ అమెజాన్ ప్రైమ్ షెడ్యూల్స్ ప్రకారం ఇదే ప్లాట్ ఫార్మ్ లో ‘ఘాటీ’ ఉండటంతో ఆసంస్థ సూచన మేరకు వారం ఆలస్యంగా ‘హరిహర వీరమల్లు’ వస్తుందని అని అంటున్నారు. ఇప్పుడు ఈనిర్ణయం ‘కింగ్ డమ్’ కు సమస్యలు తెచ్చిపెడుతుంది అని అంటున్నారు. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం మేరకు జూలై 25 తప్ప వేరే ఆప్షన్ ‘కింగ్ డమ్’ కు లేదు అని టాక్. దీనితో ఈ రెండు సినిమాల మధ్య పోటీ తప్పదు అన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: