రీసెంట్ గా తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో 2014 నుండి ఇప్పటివరకు ది బెస్ట్ అయినటువంటి ఎన్నో సినిమాలకు గద్దర్ అవార్డులను అందజేశారు. అయితే ఈ గద్దర్ అవార్డులపై తాజాగా సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసలు ఇవి గద్దర్ అవార్డులే కాదు. గద్దర్ బతికుంటే ఛీ కొట్టేవాడు.ఆయన భార్య విమలక్క ఈ అవార్డులను చూసి కంటతడి పెట్టుకుంది.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ తిరుగుబోతులు, తాగుబోతులు, వ్యభిచారులు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సిగ్గు శరం ఉంటే ఇలా చేసేవాళ్ళు కాదు.

అసలు రేవంత్ రెడ్డి దిల్ రాజును తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎందుకు చేశాడు. దిల్ రాజు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేశాడా.. ఆయన ఎవరు.. జ్యూరీ మెంబర్ గా ఉన్న జయసుధ ఎవరు.. తెలంగాణావాసా.. ఆంధ్ర నుండి వచ్చిన ఆమెని జ్యూరీ మెంబర్ చేయడం ఏంటి.. ఆంధ్ర వాళ్ళకి వంత పాడే దిల్ రాజుని చైర్మన్ చేయడమేంటి.. అసలు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేశభక్తికి సంబంధించి ఒక్క సినిమా అయినా వచ్చిందా.. రజాకార్ సినిమాకి ఎందుకు అవార్డు ఇచ్చారు.. స్మగ్లర్ కి అవార్డు ఇవ్వడం ఏంటి.. చిల్లర మనుషులందరినీ తీసుకొచ్చి జ్యూరీ మెంబర్లను చేశారు.. ఈ గద్దర్ అవార్డులన్నీ తీసుకెళ్లి మూసినదిలో పడేయాలి.గద్దర్ బతికుంటే  ఇలా అవార్డులు ఇచ్చినందుకు ఛీ కొట్టేవాడు.

చనిపోయిన ఆయన్ని ఇలాంటి వారికి ఆయన పేరు మీద అవార్డులు ఇచ్చి అవమానించకండి.వైద్యం, విద్య ఇలా ఎక్కడైనా సరే ఆంధ్రా పెత్తనమే నడుస్తోంది.తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డ్స్  లో కూడా ఆంధ్ర పెత్తనమే నడిచింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఆంధ్రా పెత్తనమే..రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆంధ్రా పెత్తనమేనా..ఇప్పటికైనా రేవంత్ కళ్ళు తెరిచి మేలుకుంటే మంచిది.. కెసిఆర్ ఉన్నప్పుడు దొంగ పనులు చేసిన ఎంపీ ఎమ్మెల్యేలందరూ మళ్ళీ మీ పార్టీలో చేరారు. ఇప్పటికైనా మీరు స్పృహలోకి రండి.. అంటూ గద్దర్ అవార్డులకు సంబంధించి సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు మీడియాలో దుమారం సృష్టించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: