టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో చాలా చిత్రాలు మళ్లీ థియేటర్స్ లో సందడి చేశాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో మాస్ మహారాజా రవితేజ నటించిన ఓ సూపర్ హిట్ మూవీ కూడా చేరబోతోంది. అదే `మిరపకాయ్`. హరీష్ శంకర్‌ డైరెక్ట్ చేసిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. థ‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.


2011 జనవరి 13న విడుదలైన `మిరపకాయ్` మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇంటిలిజెన్స్ శాఖలో ఇన్స్పెక్టర్ గా, కాలేజీలో లెక్చరర్ గా డ్యూయల్ షేడ్స్ ఉన్న రిషికేశ పాత్రలో రవితేజ అద‌ర‌గొట్టేశాడు. రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, హీరోయిన్ల గ్లామర్, థ‌మ‌న్ అందించిన సంగీతం, హ‌రీష్ శంక‌ర్ టేకింగ్‌, సాంగ్స్ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి.
అయితే ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై ఆర్.ఆర్.వెంకట్ పుప్పాల రమేశ్ నిర్మించిన మిరపకాయ్‌ మూవీ ఇప్పుడు మళ్లీ థియేటర్స్ లోకి రాబోతుంది. జూలై 11న ఈ మూవీని 4కె వెర్షన్ లో రీరిలీజ్ చేయ‌నున్నామ‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. హనుమాన్ మీడియా మిర‌ప‌కాయ్‌ను రీ రిలీజ్ చేస్తోంది. దీంతో ర‌వితేజ ఫ్యాన్స్ ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. మ‌రి ర‌వితేజ హిట్ ఫిల్మ్ రీ రిలీజ్‌లో ఎటువంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: