మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే కొన్ని అపజయం అందుకున్న సినిమాలలో కూడా హీరోగా నటించాడు. ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా చిరంజీవి తాను నటించిన ఓ సినిమా గురించి వివరిస్తూ ఒక సినిమా కథను నా దగ్గరికి తీసుకు వచ్చారు. ఆ కథ విన్నప్పుడు బాగానే అనిపించింది. కాకపోతే నాపై ఆ స్టోరీ అస్సలు వర్కౌట్ కాదు అని నాకు అనిపించింది. కాకపోతే అనేక మంది చాలా స్టోరీ చాలా క్లాస్ గా ఉంటుంది. మీపై చాలా కొత్తగా ఉంటుంది. మీపై సినిమా చాలా వర్కౌట్ అవుతుంది అని అనేక మంది అన్నారు. దానితో ట్రై చేద్దాం అని చేశాను. కానీ ఆ సినిమా వర్కౌట్ అవుట్ కాలేదు అని అన్నాడు. అలాగే ఆ సినిమా మరో హీరో చేస్తే బాగుండేది అని నాకు అనిపించింది. అలాగే ఆ హీరో కూడా సినిమా విడుదల అయ్యాక ఆ సజెషన్ నాకు ఇచ్చాడు అని చెప్పాడు. ఇంతకు అది ఏ సినిమా విషయంలో జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... కొన్ని సంవత్సరాల క్రితం నేను డాడీ అనే సినిమాలో నటించాను. ఆ మూవీ కథను మొదట నా దగ్గరికి తీసుకు వచ్చిన సమయంలో కథ విన్నాక ఇంత క్లాస్ కథ నాపై వర్కౌట్ అవుతుందా అని నాకు అనిపించింది. కానీ చాలా మంది వర్కౌట్ అవుతుంది సార్. మీపై చాలా కొత్తగా ఉంటుంది అని నన్ను కన్విన్స్ చేశారు. కానీ ఆ సమయంలో నాకు ఈ స్టోరీ నాకంటే వెంకటేష్ పై బాగుంటుంది అనిపించింది. కానీ అనేక మంది నన్ను బలవంతంగా ఒప్పించారు. దానితో నేను ఆ సినిమా చేశాను. సినిమా విడుదల అయింది. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ఒక రోజు వెంకటేష్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది. కానీ మీకంటే ఆ మూవీ నాపై ఇంకా బాగుండేది అని అన్నాడు. నేను కూడా వెంకటేష్ మాటలకు అంగీకరించి నేను అలాగే చెప్పాను వెంకటేష్ ... కాకపోతే ఎవరూ వినలేదు అని అన్నాను అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: