
టాలీవుడ్ లో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో చాలా వివాదాలు , సమస్యలు వచ్చాయి. అసలే టాలీవుడ్ చాలా సమస్యలతో సతమతమవుతోంది. ఓవైపు సినిమాల నిర్మాణం తగ్గిపోయింది. కొత్త సినిమాలు మొదలుకావటం లేదు. రిలీజ్ అయిన సినిమాలు కూడా డిజాస్టర్లు అవుతున్నాయి. గతంలో వారానికి కనీసం నాలుగైదు సినిమాలకు క్లాప్ప్ పడేవి. ఇప్పుడు అలా లేదు .. సినిమా ప్రారంభించాలంటే ఆలోచించే పరిస్థితికి వచ్చేసింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సినిమా బిజినెస్ లో ఓటిటి కీలకపాత్ర పోషిస్తూ రిలీజ్ డేట్ లు నిర్ణయిస్తుంది. ఓటీటీ బిజినెస్ అయితేనే సినిమా రిలీజ్ చేసుకుని పరిస్థితి వచ్చింది. ఈ ట్రెండ్ తెలుగు సినిమా పరిశ్రమకు చాలా ప్రమాదం అని సినిమా వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే నిర్మాతలు ఓటీటీకి బ్రోకర్ గా మారిపోయే పరిస్థితి వస్తుందని అగ్ర నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్లు దీన పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
మరోవైపు థియేటర్ల బంద్ వివాదం తీవ్ర కలకలం రేపింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని టార్గెట్ చేసుకుంటూ సాగిన ఈ వ్యవహారం పై స్వయంగా పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అనే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇండస్ట్రీలో ఆ నలుగురు ప్రెస్ మీట్ లు పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక టీఎఫ్ సిసి అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటలు గడవక ముందే అగ్ర నిర్మాత సునీల్ నారంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో కార్యదర్శి శ్రీథర్ చేసిన కామెంట్లు వివాదం అయ్యాయి. ఇప్పటికి సింగిల్ స్క్రీన్ సమస్య కొలిక్కి రాలేదు. ఇక తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ప్లాప్ పై దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి చేసిన కామెంట్లతో మెగా ఫ్యాన్స్ వార్నింగ్ ఇవ్వడం చివరకు దిల్ రాజు అటు శిరీష్ రెడ్డి దానికి వివరణ ఇచ్చుకోవాల్సి రావటం జరిగాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు