
కథ :
అర్ధరాత్రి సమయంలో సూర్య (నవీన్ చంద్ర), శాంతి (కామాక్షి భాస్కర్ల) తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారంటూ సీఐ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర) వార్నింగ్ ఇస్తాడు. ఆ సమయంలో సూర్య, శాంతి లక్ష్మీకాంత్ తో వాదులాడుతుండగా సూర్య సీఐ వల్ల తమ కుటుంబానికి ఏదైనా అపాయం కలుగుతుందేమో అని భయాందోళనకు గురవుతాడు. అయితే అదే సమయంలో సూర్య, శాంతి ఒక కేసులో చిక్కుకోగా ఆ కేసు నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు. వరదరాజులు ( వీకే నరేష్) అనే లాయర్ వీళ్లకు ఏ విధంగా సహాయం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
కేవలం ఒకే ఒక్క రోజులో జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా నవ్యత ఉన్న సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు మదన్ దక్షిణామూర్తి ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్టాఫ్ నిడివి కేవలం 45 నిమిషాలే కాగా సినిమాలో ఒక్క సీన్ కూడా వృథాగా తీశారని అనిపించదు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు అదనపు బలం అని చెప్పవచ్చు. సస్పెన్స్ సన్నివేశాలు బాగానే ఉండగా నరేష్ ఎంట్రీ తర్వాత ప్రేక్షకులు కోరుకున్న ఎంటర్టైన్మెంట్ సైతం లభిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ విషయంలో దర్శకుడిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
ఈ సినిమాలో నవీన్ చంద్ర నటన కనబరిచారు. తన కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. పొలిమేర2 ఫేమ్ కామాక్షి భాస్కర్ల మరోసారి అభినయ ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. రాజా రవీంద్ర, వీకే నరేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీళ్లిద్దరి కాంబో సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి.
శేఖర్ చంద్ర మ్యూజిక్, బీజీఎమ్ కథకు అనుగుణంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. ఈ వీకెండ్ థియేటర్లలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలని భావించే వాళ్లకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎడిటింగ్, ఇతర టెక్నీకల్ విభాగాలకు సంబంధించిన టెక్నీషియన్లు తమ వంతు న్యాయం చేశారు.
బలాలు : సెకండాఫ్, ఆసక్తికర ట్విస్టులు, నవీన్ చంద్ర నటన, కామెడీ సీన్స్, డైలాగ్స్
బలహీనతలు : కొన్ని బోరింగ్ సీన్స్, సినిమాటోగ్రఫీ
రేటింగ్ : 2.75/5.0