సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ శాతం మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బ్యూటీలకు ఆ తర్వాత వరుస పెట్టి క్రేజీ సినిమాలలో , స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అదే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఫ్లాప్ ను అందుకున్నట్లయితే ఆ ముద్దుగుమ్మలకు పెద్దగా క్రేజీ సినిమా అవకాశాలు రావు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో ఫ్లాప్ ను అందుకున్న కూడా వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్లో కెరిర్ను ముందుకు సాగిస్తున్న కొంత మంది బ్యూటీలు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు. వారు ఎవరు అనేది తెలుసుకుందాం.

మీనాక్షి చౌదరి : ఈ ముద్దుగుమ్మ సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన మొదటి సినిమా ఫ్లాప్ అయిన ఆ తర్వాత ఈమెకు వరస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీగా కెరియర్ను కొనసాగిస్తుంది.

కేతికా శర్మ : ఈమె ఆకాష్ పూరి హీరోగా రూపొందిన రొమాంటిక్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా ఈమెకు వరస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.

భాగ్యశ్రీ బోర్సే : ఈ బ్యూటీ రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆయన కూడా ఈమెకు వరుస పెట్టి సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా మొదటి సినిమాతో ఫ్లాప్ ను అందుకున్న ఆ తర్వాత అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: