సినిమా సెలబ్రిటీలు ఎంత క్రమశిక్షణ అలాగే శుభ్రతను మెయింటైన్ చేస్తారో చెప్పనక్కర్లేదు.ఏదైనా సినిమా విషయంలో బరువు తగ్గాలంటే కేవలం 10, 15 రోజుల్లోనే డైట్ మెయింటైన్ చేసి బరువు తగ్గి చూపిస్తారు.లేకపోతే సినిమా కోసం బరువు పెరగాలంటే బరువు పెరిగి చూపిస్తారు.అలా సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. ముఖ్యంగా చాలా నీట్నెస్ కూడా పాటిస్తారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలందరూ నీట్ నెస్ పాటిస్తూ ఉంటే ఈ హీరోయిన్ మాత్రం చాలా గలీజ్ అంటూ సోషల్ మీడియాలో ఆమె పై ట్రోలింగ్ జరుగుతుంది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే నేషనల్ అవార్డు విన్నర్ నిత్యామీనన్. ఏంటి నిత్య మీనన్ స్నానం చేయకపోవడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనుకోవచ్చు. 

కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యమీనన్ పై ట్రోలింగ్ జరుగుతుంది.దానికి కారణం రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో నిత్యమీనన్ మాట్లాడిన మాటలే..ఇక విషయంలోకి వెళ్తే .. నిత్యమీనన్ ప్రస్తుతం ధనుష్ తో ఇడ్లీ కడాయి మూవీ తో పాటు విజయ్ సేతుపతి తో తలైవాన్ తలైవి అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే నిత్యమీనన్ బరువు పెరిగినా కూడా తన ఎక్స్ప్రెషన్స్, నటనతోనే ఎంతోమందిని ఆకట్టుకుంటుంది.అలా తిరు సినిమాలోని నిత్యామీనన్ నటనకి గానూ నేషనల్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ నేషనల్ అవార్డు అందుకున్న సందర్భంలో ఒక విషయం తనని చాలా ఆకట్టుకుంది అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

నేను నేషనల్ అవార్డు అందుకోవడానికి ముందు రోజు ఇడ్లీ కడాయి సినిమా షూటింగ్లో ఉన్నాను. ఆ సినిమా షూటింగ్లో పేడతో పిడకలు చేసే సీన్ చేశాను.ఇక నెక్స్ట్ డేనే నేషనల్ అవార్డు అందుకోవడానికి స్టేజ్ మీదకు వెళ్లాను.ఇక ఆ అవార్డు తీసుకున్నప్పుడు చేతివేళ్ల గోర్లలో పేడ అలాగే ఉంది అంటూ చెప్పింది.అయితే ప్రస్తుతం నిత్యమీనన్ మాట్లాడిన మాటలు ట్రోలింగ్ కి గురవుతున్నాయి.కనీసం గోర్లలో ఇరుక్కున్న పేడ కూడా తీసుకునే టైం లేదా.. స్నానమైన సరిగ్గా చేస్తావా లేదా అంటూ సోషల్ మీడియా నెటిజెన్లు నిత్యమీనన్ ని ఏకిపారేస్తున్నారు. ఇక గోళ్ళలో పేడ ఉందని చెప్పడమే కాదు అదో మంచి అనుభూతి అంటుంది. అదేం ఫీలింగ్ రా బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నిత్య మీనన్ మాట్లాడిన మాటలు మాత్రం ట్రోలింగ్ కి గురవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: