
ప్రభాస్ తో కలిసి ఒక్కసారైనా నటించాలనుందని ఎంతోమంది హీరోయిన్లు తమ కోరికలు బయటపెట్టారు. కొందరు ఒక అడుగు ముందుకేసి ప్రభాస్ ఛాన్స్ ఇస్తే డేట్ చేస్తామని, పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు. కానీ ప్రభాస్ ను గతంలో ఓ ఇంటర్వ్యూలో ఫేవరెట్ హీరోయిన్ గురించి ప్రశ్నించగా.. టక్కున ఆయన దీపిక పేరు చెప్పేశారు. అంతే కాదు దీపికా పదుకొనేతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ ఓపెన్ స్టేట్మెంట్ సైతం ఇచ్చారు. కట్ చేస్తే.. `కల్కి 2898 ఏడీ` చిత్రంలో దీపికాతో ప్రభాస్ తెర పంచుకున్నారు. తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు.
కాగా, ప్రస్తుతం ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా `కన్నప్ప` చిత్రంతో అతిథి పాత్రలో మెరిసన ప్రభాస్.. ఈ ఏడాది డిసెంబర్ 6న `ది రాజా సాబ్` మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మారుతి డైరెక్ట్ చేస్తున్న హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. అలాగే హను రాఘవపూడితో `ఫౌజీ`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` చిత్రాలు చేస్తున్నాడు. `సలార్ 2`, `కల్కి 2` ప్రాజెక్ట్స్ కూడా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు