
ఏక్తా కపూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అల్ట్ బాలాజీ ఓటీటీ చాలా కాలంగా రెగ్యులర్ కంటెంట్‌కు మించి గ్లామర్‌ను ఎగ్జాగరేట్ చేస్తూ వెళ్ళింది. అలాగే ఉల్లు యాప్ రోజురోజుకీ రియాలిటీ షోల పేరుతో శృతిమించిపోయింది. రాత్రి 9 తర్వాత ఫోన్‌లలో ఈ యాప్ ఓపెన్ చేస్తే ఏదో అసహజ ప్రపంచంలోకి వెళ్ళిన ఫీల్ ఇస్తూ ట్రెండ్ అయ్యేది. అయితే ఇదంతా చూసిన కేంద్రం ఇక టాలరేట్ చేయక, పూర్తి నివేదికలు తెప్పించి… వీటిని పోర్న్ ప్రమోషన్ ప్లాట్‌ఫామ్స్‌గా గుర్తించి బ్యాన్ చేసింది. google Play Store, apple App Store ల నుంచి కూడా ఈ యాప్స్‌ను తొలగించాలని ఐటీ శాఖ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. భారతదేశ చట్టాలను, సమాచార నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగాలపై ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.
కేంద్రం స్పష్టం చేసింది – ఇకపై ఓటీటీలైనా, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయినా దేశ చట్టాలకు లోబడే ఉండాలి. లేకపోతే చట్టపరంగా గట్టి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యాప్స్ బ్యాన్ అయినా… వాటిలోని వీడియోలు, సిరీస్‌లు, క్లిప్‌లు మాత్రం సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం ఆగుతాయా? అనేది మరో పెద్ద ప్రశ్నే. మొత్తానికి “వినోదం పేరుతో విచ్చలవిడిగా పోర్న్‌ను ప్రమోట్ చేసే ఓటీటీలకు చెక్ పెట్టిన కేంద్రం”, ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇకపై నాణ్యమైన, ఆరోగ్యకరమైన కంటెంట్ అందించే ఓటీటీల దిశగా మారాలని విశ్లేషకుల అభిప్రాయం.