పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరి హర వీరమల్లు సినిమా తాజాగా థియేటర్లలో విడుదల ఆయన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈయన ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దానితో హరిహర వీరమల్లు సినిమా నిర్మాత కుమారుడు అయినటువంటి ఏ ఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. అందులో మొదటి భాగం కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

తాజాగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన హరి హర సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా జ్యోతి కృష్ణ మాట్లాడుతూ  ... క్రిష్ గారు హరిహర వీరమల్లు సినిమా కథను కేవలం ఒక భాగంగా మాత్రమే తయారు చేశారు. ఆయన కేవలం కోహినూర్ వజ్రం దొంగతనం చుట్టూ కథను రాసుకున్నారు. ఆయన సినిమా నుండి తప్పుకున్నాక నేను మరికొన్ని సన్నివేశాలను యాడ్ చేశాను. దానితో సినిమా రెండు భాగాలుగా తీస్తే బాగుంటుంది అనే ఆలోచన నాకు వచ్చింది. ఇక హరిహర వీరమాల్లు రెండవ భాగం మాత్రం క్రిష్ గారు రాసుకున్న కథతో ఉంటుంది.

ఆ రెండవ భాగం మొత్తం కోహినూరు డైమండ్ చుట్టూ తిరుగుతుంది అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇలా హరి హర విరమల్లు సినిమా రెండవ భాగం క్రిష్ జాగర్లమూడి రాసుకున్న కథ చుట్టూ తిరగనున్నట్లు , అది కోహినూర్ డైమండ్ దొంగతనం చుట్టూ సాగనున్నట్లు జ్యోతి కృష్ణ చెప్పడంతో ఈ సినిమా రెండవ భాగం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: