చాలామంది నటీనటులు మంచివాళ్ళ ముసుగులు వేసుకొని బయట నటిస్తూ ఉంటారు. తెరముందు ఎలా నటిస్తూ ఉంటారో మేకప్ తీసేసాక కూడా బయట అలాగే నటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అసలు రూపం దగ్గరికి వాళ్లకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే తాజాగా మంచివాడు ముసుగులో ఉన్న ఓ హీరో గురించి సంచలన విషయం బయట పెట్టింది ఓ అమ్మాయి. అయితే ఆ హీరో మంచి వాడి ముసుగులో ఎంతోమంది అమ్మాయిలని వాడుకొని కేరావాన్ లో సెక్స్ చేశాడు అంటూ సంచలన పోస్ట్ పెట్టింది.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు.. అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కోలీవుడ్లో ప్రముఖంగా ఉండే ఈ హీరో మంచివాడు ముసుగులో ఎన్నో దారుణాలు చేస్తున్నట్టు తాజాగా రమ్య మోహన్ అనే అమ్మాయి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన పోస్ట్ పెట్టింది..

ఆ పోస్టులో ఏముందంటే.. డ్రైవ్స్ కోసం 50,000 కేరావాన్ ఫేవర్స్ కోసం 2 లక్షలు ఆఫర్ చేసి ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడు అంటూ రమ్య మొహన్ తన పోస్టులో పేర్కొంది. అయితే ఆ హీరో వల్ల నష్టపోయిన అమ్మాయి ప్రస్తుతం రిహబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలియజేసింది.పరిశ్రమ నిబంధనల ముసుగులో ఈ హీరో ఆ అమ్మాయిని చాలా సంవత్సరాల నుండి వాడుకుంటున్నాడని తన పోస్టులో తెలియజేసింది. అంతేకాదు తమిళ ఇండస్ట్రీలో చాలా రోజుల నుండి వినిపిస్తున్న డ్రగ్స్,లైంగిక వేధింపుల గురించి ఈ షాకింగ్  పోస్ట్ పెట్టింది. అంతేకాదు బాధితులను పట్టించుకోకుండా మీడియా ఆ హీరోని దేవునిన చేస్తుంది అంటూ ఆమె మీడియా వాళ్లని కూడా విమర్శించింది.

 దీంతో రమ్య మోహన్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారడంతో ఈమె పెట్టిన పోస్ట్ గురించే అందరూ మాట్లాడుకున్నారు.అయితే మరొక విశేషం ఏమిటంటే.. ఆమె పెట్టిన పోస్టులో ఆ హీరో పేరు కూడా ట్యాగ్ చేసింది. దీంతో ఆ హీరో నిజస్వరూపం ఇదా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికి మళ్ళీ రమ్య మోహన్ దాన్ని డిలీట్ చేసింది. దీంతో పోస్ట్ చేసిన రమ్య మోహన్ దీన్ని ఎందుకు డిలీట్ చేసింది.. ఆ హీరో ఏమైనా బెదిరించాడా.. నిజమైతే దీన్ని ఎలాంటి భయం లేకుండా బయట పెట్టాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు  నెటిజన్స్.మరి చూడాలి ఈ వ్యవహారం ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: