ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ని తొక్కేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు అన్నమాట పూర్తిగా వాస్తవం . దానికి సంబంధించి ఎన్ని విషయాలు బయటపడ్డాయో అందరికీ తెలిసిందే.  హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి ముందు థియేటర్స్ బంద్ చేయాలి అంటూ నిర్ణయించుకొని ఆ నలుగురు ఇండస్ట్రీలో హైలైట్ గా మారిపోయారు . చాలామంది ఆ నలుగురులో మేము లేము అంటూ తమకు తామే చెప్పుకున్నారు . ప్రెస్ మీట్ లు పెట్టి మరి ఆ నలుగురులో మేము లేము అంటూ క్లారిటీ ఇచ్చారు . ఇవన్నీ పక్కనపడితే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది . మొదటి రోజు రెండవ రోజు మంచి టాక్ బాగానే వినిపించింది.   హై కలెక్షన్స్ కలెక్ట్ చేసిన హరిహర వీరమల్లు ఆ తర్వాత కొంచెం కొంచెం డౌన్ అవుతూ వచ్చింది .


దీనికి కారణం ఒక బిగ్ బడా పేటీఎం బ్యాచ్ అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. కొందరు డబ్బులు ఇచ్చి పవన్ కళ్యాణ్ సినిమాకి నెగిటివ్ గా రివ్యూ రాయించారు.. కావాలని తొక్కేశారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . అంతేకాదు హరిహర వీరమల్లు కంటే ఓజి సినిమాని ఎక్కువగా హైలెట్ అవుతుంది అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ . హరిహర వీరమల్లు సినిమా టైంలో కూడా చాలామంది మీడియా రిపోర్టర్స్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఓ జి సినిమాకి సంబంధించి మాట్లాడడం ఇంకా హైలెట్గా మారింది . అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను పట్టించుకోలేదు అని ఓ జి సినిమానే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చాడు అని ఓజి సినిమా అంటే పవన్ కళ్యాణ్ కి ఇష్టం అంటూ ఆ పేటీఎం బ్యాచ్ నెగటివ్గా కామెంట్స్ చేసింది .



దీంతో పవన్ కళ్యాణ్ వాటిపై సీరియస్ అయ్యారు. తనకు ఓజీ ఎంతో అదే విధంగా హరిహర వీరమల్లు కూడా అంతే అంటూ సినిమాకి హై రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహించారు.  ఇవన్నీ పక్కనపడితే ఇప్పుడు ఓ జి సినిమాకి సంబంధించిన న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది .రీసెంట్ గా రిలీజ్ అయిన "ఫైర్ స్ట్రోమ్"  పాట విన్న తర్వాత పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎలాంటి హిట్ అయితే కొట్టాలి అని అభిమానులు ఆశపడ్డారో అలాంటి హిట్ ఈ సినిమా ద్వారా వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ముఖ్యంగా ఈ సినిమాకి ఆయన నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ బిగ్ ప్లస్ గా మారిపోతున్నాయి అంటున్నారు . హరిహర వీరమల్లు సినిమాతో ఎవరైతే తనపై నెగిటివ్ గా కామెంట్ చేసారో వాళ్ళందరి నోర్లు మూయించడానికి పవన్ కళ్యాణ్సినిమా ప్రమోషన్స్ ని ఇంకా ముందుగానే స్టార్ట్ చేసి ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రాబట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారట.  ఈ దెబ్బకి ఇక పవన్ గురించి  నెగిటివ్గా మాట్లాడే బ్యాచ్ మొత్తం షట్ డౌన్ అయిపోవాల్సిందే అంటున్నారు పవన్ ఫ్యాన్స్ . చూద్దాం ఎలాంటి మర్చిపోలేని రిజల్ట్ ఇస్తుందో ఈ ఓజీ పవన్ కళ్యాన్ కి..???

మరింత సమాచారం తెలుసుకోండి: