
మహేష్ బాబు ఎంతోమంది చిన్నారుల గుండెలను కాపాడారు. ఇప్పటికే 5000 వేల మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించారు అలా ఎంతోమంది చిన్నారుల గుండెలు ఆగిపోకుండా బ్రతికిస్తున్నారు మహేష్ బాబు..ఈ విషయాన్ని ఎక్కడా కూడా మహేష్ బాబు పెద్దగా చెప్పుకోరు.. కానీ ఈ విషయం తెలిసిన చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా మహేష్ బాబును ప్రశంసిస్తూ ఉంటారు.
మహేష్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు గుండె సంబంధిత సమస్యతో పుట్టారని తనకు ఆర్థికంగా సౌలభ్యం ఉండడం వల్ల సర్జరీ చేయించగలిగాను కానీ డబ్బులు లేని చిన్నారుల పరిస్థితి ఏంటా అని ఆలోచనతోనే ఈ హార్ట్ సర్జరీ పుట్టిందట. మహేష్ బాబు ఫౌండేషన్ ని తన భార్య నమ్రతతో కలసి 2020లో స్థాపించారు. ప్రతి ఏడాది కూడా సుమారుగా 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అలాగే తన సంపదలో సుమారుగా 30% సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నారట.
వీటికి తోడు బాలికల గర్భకోస క్యాన్సర్, ఉచిత వైద్య శిబిరాలను, స్కూళ్లల్లో కంప్యూటర్లతో పాటు దత్తకు తీసుకున్న గ్రామాలను కూడా అభివృద్ధి చేయిస్తూ ఉన్నారట మహేష్ బాబు. 2016లో ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం , తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడ ప్రజలకు అన్ని వసతులను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిన మహేష్ బాబు రియల్ హీరోగా పేరు సంపాదించారు అందుకే ఆయన అభిమానులు కూడా ఎక్కువమంది ఉన్నారని చెప్పవచ్చు..
హార్ట్ సర్జరీ వెబ్సైట్ కోసం..https://WWW.maheshbabufoundation.org/request/ వెబ్సైట్లో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చట.