బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. ఈ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా రెండు ఇళ్లను డిజైన్ చేశారు. ఇందులో ఒకదాన్ని మెయిన్ హౌస్ అని, మరొకదాన్ని ఔట్ హౌస్ అని పిలుస్తున్నారు.

మెయిన్ హౌస్‌లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ, ఔట్ హౌస్‌లో కనీస సౌకర్యాలు కూడా ఉండవు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఎంట్రీ ఇవ్వడం విశేషం. బిగ్ బాస్ నియమం ప్రకారం, సామాన్యులు మెయిన్ హౌస్‌లో ఉండగా, సెలబ్రిటీలు ఔట్ హౌస్‌లో ఉండాల్సి వచ్చింది. తనూజ పుట్టస్వామి, ఫ్లోరా షైనీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, భరణి, రీతూ చౌదరి, సంజన గల్రాని, రాము రాథోడ్,  సుమన్ శెట్టి సెలబ్రిటీలుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

కళ్యాణ్ పడాల, హరిత హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్, డిమోన్ పవన్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి,  మనీష్ మర్యాద సామాన్యులుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రీతూ చౌదరిపై ఉన్న ఈ అంచనాలు నిజమవుతాయో లేదో తెలియాలంటే ఆమె గేమ్‌లో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఆమె తనపై ఉన్న అంచనాలను అందుకుని, బిగ్ బాస్ టైటిల్‌ను గెలుచుకుంటుందా? వేచి చూడాలి.  బిగ్ బాస్ షో రేటింగ్స్ విషయంలో సైతం అదరగొట్టాలని బిగ్ బాస్  అభిమానులు ఫీలవుతున్నారు.  బిగ్ బాస్ ఇతర భాషల్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: