
సాయి మార్తాండ్ దర్శకుడిగా మొదటి అడుగులోనే పెద్ద అడ్వాన్స్‌లు అందుకున్నాడు. సినిమా సెట్స్ పై ఉండగానే జగపతిబాబు అడ్వాన్స్ ఇచ్చరు. రిలీజ్ తర్వాత కూడా కనీసం ఐదుగురు నిర్మాతలు సాయి మార్తాండ్ తో సినిమాలు చేయడానికి ముందుకొచ్చారు. సంగీత దర్శకుడు సింజిత్ కూడా ఈ సినిమాతో స్టార్ – నిర్మాతల దృష్టిలో నిలిచాడు. ఇక ‘మిరాయ్’ వంతు. ఈ సినిమాతో తేజా పాపులారిటీ భాగా పెరిగింది. ఇప్పటికే జాంబీరెడ్డి 2 లో బిజీగా ఉన్న తేజాకు బాలీవుడ్ నుంచి కూడా ఓ ఆఫర్ వచ్చింది. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలు మరిన్ని సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. మంచు మనోజ్ విలన్ రోల్ లో బిజీ అవ్వబోతున్నాడు. పెండింగ్‌లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి.
‘కిష్కింధపురి’ యావరేజ్ మార్క్ దగ్గర ఆగినా, దర్శకుడు కౌశిక్ కి మరో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో విలన్‌గా నటించిన శాండీ మాస్టర్ కూడా బిజీ అయిపోతున్నాడు. కోర్ట్ దర్శకుడు నానితో మరో సినిమా కోసం రెడీ అయ్యాడు. రోషన్, శ్రీదేవి ఈ సినిమాలో నటించబోతున్నారు. వీరి తో కోన వెంకట్ ‘బ్యాండ్ మేళం’ షూటింగ్ మొదలుపెట్టారు. అలాగే రోషన్ కు ఇప్పటికే నాలుగు సినిమాల్లో చాన్స్ లభించింది.ఇలా సినిమా హిట్లు, అడ్వాన్సులు, కొత్త అవకాశాలు–ఇది ఒక్కసారే ఇండస్ట్రీలో కొత్త ఉత్సాహం తీసుకువచ్చే సమయం. హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు, విలన్ ఇలా అందరూ బిజీ అవుతుంటే, సినిమాల షెడ్యూల్, అడ్వాన్సులు, కొత్త ప్రాజెక్ట్‌లు అన్నీ మాస్ వాతావరణం గా మారిపోయాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో అసలు సీజన్ మొదలైందట!