ఎంత ఓపిక ఉన్న ఫ్యాన్స్ అయినా, తమ సొంత హీరో అయినా సరే, ఒకానొక సమయంలో అతిగా చేసే ఓవర్ యాక్షన్ చూసి విసిగిపోతారు. ఆ సమయంలో వారు తప్పకుండా స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతానికి అలాంటి పరిస్థితినే ఒక స్టార్ హీరో కొడుకు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇతడు ఒక పెద్ద స్టార్ కొడుకు. తండ్రి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన చెప్పే డైలాగ్‌లు, ఆయన మాట తీరు.. ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉంటాయి. మాటలతోనే జనాలను మాయ చేసే స్థాయి కలిగిన స్టార్ ఆయన. అయితే ఆయన కొడుకు మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమాతో మాత్రమే హిట్ అందుకున్నాడు. మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మార్కులు వేయించుకోలేకపోయాయి.


అంతే కాదు, సినిమాల పరంగా కన్నా వ్యక్తిగతంగా ఎక్కువగా ట్రోల్స్ ఎదుర్కొంటూ వస్తున్నాడు. సోషల్ మీడియాలో అతని ప్రతి చిన్న విషయాన్ని కూడా మీమ్స్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆయన చేసే ప్రవర్తన, ఆయన చూపించే ఓవరాక్షన్స్ అన్నీ జనాలకు విసుగు తెప్పించే స్థాయిలో ఉన్నాయన్న అభిప్రాయం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఆయన చేసిన ఒక సినిమా భారీ ఎత్తున ప్రమోషన్‌తో రిలీజ్ చేశారు. ఆ సమయంలో చేసిన హంగామా, చేసిన పబ్లిసిటీ, ఇచ్చిన స్టేట్మెంట్స్— ఇండస్ట్రీ మొత్తాన్నే కుదిపేశాయి. "ఇతడే రాబోయే రోజుల్లో ఇండస్ట్రీని మోసే హీరో" అంటూ పలువురు ప్రముఖులు కూడా కామెంట్స్ చేశారు. కానీ చివరికి సినిమా ఫలితం అలా రాకపోవడంతో ఆయనపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.



సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఆయన సోషల్ మీడియాలో హై డప్పు కొట్టుకుంటూ, ఓవరాక్షన్ మెసేజ్‌లు పెడుతూ, "బాలీవుడ్.. హాలీవుడ్" అంటూ నానా హంగామా చేయడం మొదలుపెట్టాడు. దీంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. అసలు ఈ హీరో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఎందుకు ఇంత అతి చూపిస్తున్నాడు? అనే డౌట్స్ సొంత ఫ్యాన్స్‌కే వచ్చాయి.ఇప్పుడైతే పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. సొంత అభిమానులే సోషల్ మీడియా వేదికగా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. "ముందు నువ్వు నీ ఓవరాక్షన్ ఆపు, తర్వాత ఒక హిట్ కొట్టు" అంటూ నేరుగా కౌంటర్ వేస్తున్నారు. సాధారణంగా అభిమానులు తమ హీరోపై నెగిటివ్‌గా రియాక్ట్ అయ్యే పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయి. కానీ ఈ హీరో తన ప్రవర్తన వల్ల అలాంటి పరిస్థితినే తెచ్చుకున్నాడు.



దీంతో చాలా మంది "ఇక ఇండస్ట్రీలో ఈ హీరో స్థానం పూర్తిగా డమ్మీ అయిపోయినట్టే" అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి, ఓవర్ యాక్షన్‌తో తాను స్టార్ అవుతానని అనుకున్న ఈ హీరోకి ఇప్పుడు అదే ఓవర్ యాక్షన్ పెద్ద సమస్యగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: