
ప్రతి సినిమా రిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చూపించే ఉత్సాహం, ఆయనపై చూపించే ఆరాధన వేరే స్థాయిలోనే ఉంటుంది. ప్రతి సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ మరింత ఎక్కిపోతూ, ఒక్కో మెట్టు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆ స్థాయిని మరోసారి చూపిస్తూ, కొత్త రికార్డులు సృష్టించేలా సిద్ధమవుతున్నారు అభిమానులు.
సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఓజీ సినిమాకి సంబంధించి ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతకుముందే సెప్టెంబర్ 24 రాత్రి ప్రీమియర్స్ పడబోతున్నాయ్. ఎక్కడ చూసినా “ఓజీ… ఓజీ…” అనే నామస్మరణే వినిపిస్తోంది. ఇంకా రెండు రోజులు టైమ్ ఉన్నా, అభిమానులు మాత్రం ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఎక్కడ టికెట్లు రిలీజ్ చేసినా క్షణాల్లోనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఇది పవన్ మానియా ఎలా ఉందో చెప్పకనే చెప్పేస్తోంది.తాజాగా ఓజీ సినిమా రిలీజ్ కి ముందే ఒక సెన్సేషనల్ రికార్డు క్రియేట్ అయింది. నార్త్ అమెరికా ప్రాంతంలో కేవలం రీసెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఏకంగా 70,000 టికెట్లు అమ్ముడయ్యాయి. అక్కడ సినిమా ఫీవర్ ఎంత వుంటుందో దీని ద్వారానే అర్థం అవుతోంది. సినిమా విడుదల తర్వాత ఈ లెక్కలు మరింత ఎక్కడానికి అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఇమ్రాన్ విలన్ రోల్ లో కనిపించనుండగా, ఆయనతో వచ్చే ఫైట్ సీన్స్ వేరే స్థాయిలో ఉంటాయని టాక్. అలాగే ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి తదితరులు తమ నటనతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని అంటున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రానికి ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.అభిమానుల దృష్టిలో ఇది కేవలం సినిమా మాత్రమే కాదు… ఒక పండుగ. రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టించిన పవన్ కళ్యాణ్ సినిమా, థియేటర్స్ లో పడిపోగానే మరిన్ని సెన్సేషనల్ రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ముందుకు వెళ్తున్నారు.