తిరుమల పరకామణిలో చోటు చేసుకున్న రూ. 100 కోట్ల కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ చోరీని తామే బయటపెట్టామని, 20 సంవత్సరాలుగా దొంగతనం చేస్తున్న రవికుమార్‌ను తాము చైర్మన్‌గా ఉన్నప్పుడే పట్టుకున్నామని ఆయన చెప్పారు. మంత్రి నారా లోకేష్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాము రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేశామని, చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు.

ఈ కేసు విచారణను సిబిసిఐడితో కాకుండా సిబిఐతో విచారణ జరపాలని, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ సవాల్‌ను స్వీకరించాలని భూమన అన్నారు. ఈ నేపథ్యంలో, ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతుందా, లేదా అనేది వేచి చూడాలి. మరోవైపు టీడీపీ నేతలు  సైతం భూమన  కామెంట్లకు రివర్స్ లో కౌంటర్లు ఇస్తున్నారు.  భూమన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా కూడా సంచలనం అవుతున్నాయి. భూమన వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

ఏపీ రాజకీయాల్లో టీడీపీ వైసీపీ మధ్య విమర్శలు  హాట్ టాపిక్ అవుతున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: