తెలంగాణ రాష్ట్ర సమితి.. ఈ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రత్యేక ఉద్యమం స్టార్ట్ అయి చివరికి రాష్ట్రం సిద్ధించింది. ఈ పార్టీ జెండా కింద ఎంతోమంది నాయకులు, ప్రజలు తెలంగాణ హక్కుల కోసం పోరాడి చివరికి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇంతటి పోరాటానికి బ్యాక్ బోన్ ఎవరంటే అందరికీ గుర్తుకు వచ్చేది కేసీఆర్. ఆయన ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపారు కాబట్టే తెలంగాణ వచ్చింది. అలాంటి ఈ తెలంగాణలో మొదటిసారి సీఎం అయ్యింది కూడా కేసీఆరే.. అయితే ఇదంతా బాగానే ఉన్నా కేసీఆర్ అనే ఒక బ్రాండ్ ను పట్టుకొని తన కుటుంబం మొత్తం రాజకీయాల్లోకి వచ్చింది.. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు.. తెలంగాణను పాలించినన్ని రోజులు వీరి కనుసన్నల్లోనే రాజకీయమంతా నడిచింది. అలా తెలంగాణ ప్రజలు రెండు పర్యాయాలు ఈ పార్టీని గెలిపించి చివరికి మూడవసారి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇదే తరుణంలో ఎలాగైనా వచ్చే ఎలక్షన్స్ లో మంచి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు కవిత రూపంలో ఒక దెబ్బపడింది. కవిత కేసీఆర్ కు ఎందుకు దూరమవుతోంది ఆ వివరాలు చూద్దాం..

 నాన్నను వాళ్ళు ముంచేస్తున్నారు:

 కవిత ఎప్పుడైతే లిక్కర్ స్కాంలో ఇరుక్కొని జైలు  నుంచి బయటకు వచ్చిందో అప్పటినుంచి తన కుటుంబంతో విభేదాలు పెట్టుకుంటూ వస్తోంది. చివరికి కేసీఆర్ కు తన బాధని చెప్పుకోవాలని ప్రయత్నం చేసిన ఆయన ససేమిరా అనడంతో కోపోద్రిక్తురాలైన కవిత చివరికి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు లను టార్గెట్ చేసి మాట్లాడింది. హరీష్ రావు పెద్ద ఫ్రాడ్ అంటూ తన తండ్రిని ముంచేస్తారని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన అన్న కూడా మంచివాడు కాదని కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని వర్ణించింది. ఇలా వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో బీఆర్ఎస్ పార్టీలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంకేముంది కవితను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు పార్టీ అధిష్టానం. దీంతో కవిత జాగృతి పేరుతో సరికొత్త పంథాతో ముందుకు వస్తోంది. ఎలాగైనా తండ్రి మనసు దోచేయాలని ప్రయత్నాలు చేస్తోంది.

 బతుకమ్మ వేడుకల్లో భావోద్వేగం:

తాజాగా బతుకమ్మ వేడుకల సందర్భంగా  చింతమడక ప్రజల ఆహ్వానం మేరకు ఆమె అక్కడికి హాజరై బతుకమ్మ వేడుకల్లో ఆడి పాడింది. చింతమడక గ్రామంతో తనకున్నటువంటి అవినాభావసంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. తన తండ్రి కేసీఆర్ తనని పట్టించుకోవడంలేదని కొంతమంది వ్యక్తులు తనను దూరం చేశారన్నది. చింతమడక అంటే ఒక చరిత్ర కలిగిన గ్రామం..అసలు తెలంగాణ ఉద్యమానికి మొదట అడుగు పడింది కూడా ఈ గ్రామం నుంచే అంటూ చెప్పుకొచ్చింది. చాలా ఏళ్ల నుంచి ఈ గ్రామానికి నేను రాలేదు. కానీ మీ ద్వారా మరోసారి రావడానికి అవకాశం వచ్చింది. చింతమడక ఇచ్చిన ధైర్యంతోనే రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా బతుకమ్మ గురించి చాటి చెప్పాను. అయితే నేను చింతమడక రావాలంటే కొన్ని ఆంక్షలుంటాయి. సిద్దిపేట మరియు చింతమడక గ్రామాలు వాళ్ల ప్రైవేట్ ఆస్తుల్లా భావిస్తున్నారు. వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా గ్రామానికి నేను వస్తానని చెప్పుకొచ్చింది కవిత. నన్ను నా కుటుంబానికి దూరం చేస్తూ చాలా ఏడిపిస్తున్నారు.. నన్ను ఎంత ఏడిపించిన బరిస్తాను కానీ మా నాన్నను మోసం చేయాలని చూస్తే అస్సలు ఊరుకోను. నేను ఇంత దుఃఖంలో ఉన్నా కానీ చింతమడక గ్రామస్తులు నన్ను ఆదరించారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, మీ అందరికీ రుణపడి ఉంటాను అంటూ కవిత ఎమోషనల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: